Saturday, May 11, 2024

ఇక ప్రభుత్వ మటన్ దుఖాణాలు..

తప్పక చదవండి
  • కసరత్తు చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్..
  • మాసాబ్ ట్యాంక్ లో మొదటి మాన్ క్యాంటీన్..
  • తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే యోచన..
  • గొర్రెల పెంపకందారులతో ఈ దుఖాణాలు అనుసంధానం..

హైదరాబాద్ : తెలంగాణ అంటేనే దావతులకు, ఫంక్షన్లకు పెట్టింది పేరు.. ఇకపోతే నాన్ వెజ్ వంటకాల విషయంలో తెలంగాణలో వినియోగం చాలా ఎక్కువ అన్నది వాస్తవం.. మటన్ వినియోగం అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది.. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి మటన్ షాప్ ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపిస్తాయి. మరోవైపు ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకంపై దృష్టి పెట్టి, లక్షల గొర్రెల యూనిట్లను ఉచితంగా పంచింది. గతంలో తెలంగాణకు మటన్ ఇంపోర్ట్ అయ్యేది. ఇప్పుడు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతోంది.. అయితే ఇంత జరుగుతున్నా మాంసం ధర మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది.. మధ్యతరగతి జీవులకు మటన్ అందకుండా పోయే పరిస్థితి గోచరిస్తోంది.. దీంతో తెలంగాణ ప్రభుత్వం మటన్ క్యాంటీన్లను తెరిచేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.. షిప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫిష్ క్యాంటీన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది మాసబ్ ట్యాంక్ లో ఉన్న ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటగా మటన్ క్యాంటీన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో, హైదరాబాదులో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ మటన్ క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రైతో పాటు మాంసాన్ని కూడా ఈ క్యాంటీన్ లో విక్రయించదానికి సన్నాహాలు చేస్తున్నారు.. బయట ప్రైవేట్ మార్కెట్ కంటే తక్కువ ధరలో ఇక్కడ మటన్ ఉత్పత్తులు లభిస్తాయి. దీంతో పాటు గొర్రెల పెంపకం దారులకు కూడా ఈ మటన్ క్యాంటీన్లకు అనుసంధానం చేసి, నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునేలా లింక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు