Sunday, May 5, 2024

ఇక ఇండియా కాదు..

తప్పక చదవండి
  • భారత్‌ తొలి అడుగు వేసిన కేంద్రం..
  • జి20 ప్రతినిధులకు ఆహ్వానంతో మార్పు
  • ప్రసిడెంట్‌ ఆఫ్ భారత్‌ నుంచి ఆహ్వానాలు
  • భారత్‌ పేరుపై కాంగ్రెస్‌ వంకర బుద్ది
  • మేరా భారత్‌ మహాన్‌ అంటూ అమితాబ్‌ ట్వీట్‌

న్యూఢిల్లీ : ఇండియాను భారత్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు అడుగు పడిరది. మేరా భారత్‌ అన్న పదం రానుంది. ఇండియా ఇక భారత్‌గా మారనుంది. గతంలో ఉన్న పేరునే ఇప్పుడు తీసుకుని వచ్చే ప్రయత్నాల్లో అడుగు పడిరది. ఇప్పటికే అనేకులు భారత్‌ అని పిలవాలని చేస్తున్న సూచనలను పరిగిణనలోకి తీసుకున్న కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢల్లీి వేదికగా మరికొన్ని రోజుల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ పేరుతో ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశం పేరు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్చకు కారణమైంది జీ20 సమ్మిట్‌. దేశంలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా వివిధ దేశాల అధినేతలకు భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఆ ఆహ్వానాల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అని కాకుండా.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాసి ఉంది. దీంతో వివాదం చెలరేగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశం పేరు మార్చబోతుందా అనే చర్చ మొదలైంది. దీనిపై కేంద్ర సర్కారు తీరుపై ప్రతిపక్షాల దాడి చేస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. సెప్టెంబర్‌ 9న జరగనున్న జీ20 సమావేశానికి ఆహ్వాన లేఖల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాశారని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1పై దాడి చేయడమేనని ఆరోపించారు. సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఇండియా అనే పదాన్ని తొలగించే ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్ట వచ్చని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ హర్నామ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇండియా అనే పదానికి బదులుగా భారత్‌ అనే పదాన్ని ఉపయోగించాలని దేశం మొత్తం డిమాండ్‌ చేస్తోందని అన్నారు. బ్రిటీష్‌ వారు ఇండియా అనే పదాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. భారత్‌ అనే పదం మన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మార్పు రావాలని, అందులో భారత్‌ అనే పదాన్ని చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌1లో మాత్రమే దేశం పేరు ప్రస్తావించారు. ఇండియా, అంటే భారత్‌, రాష్టాల్ర యూనియన్‌ అని పేర్కొన్నారు. దేశాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారో తెలిపే రాజ్యాంగంలోని నిబంధన ఇదొక్కటే. దీని ఆధారంగా దేశాన్ని హిందీలో భారత్‌ రిపబ్లిక్‌ అని, ఇంగ్లీష్‌ లో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అని రాశారు. తాజా పరిణామాలతో ఇండియా ఇక భారత్‌గా మారనుందనే ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్‌ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్‌ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే పక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని, ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్‌ పావులు కదుపుతోందని సమాచారం.రాష్ట్రపతి భవన్‌ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఈ లేఖను ట్వీట్‌ చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు. జీ20 డిన్నర్‌కు సంబంధించి రాష్ట్రపతి ప్రతినిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ప్రస్తావించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించడం కొనసాగిస్తున్నారని, ఇండియాను విభజిస్తున్నారని మరో ట్వీట్‌లో జైరాం రమేష్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశం ఇప్పటికీ, ఎన్నటికీ భారత్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు తానేవిూ చెప్పదలుచుకోలేదని, తాను భారత్‌వాసినని, తన దేశం పేరు భారత్‌ అని ఎప్పటికీ భారత్‌గానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాలని హితవు పలికారు. మరోవైపు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సానుకూలంగా స్పందించారు. అమితాబ్‌ బచ్చన్‌ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత్‌ మాతా కీ జై అని నినదించారు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు. అమితాబ్‌ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. జైహో, జై హింద్‌జై భారత్‌… అంటూ ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు