Tuesday, May 14, 2024

నీలం మధుకు ఘన స్వాగతం పలికిన సబ్బండ వర్గాలు..

తప్పక చదవండి
  • బొంతపల్లిలో మత్స్యశాఖ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం..
  • ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్
  • భారీగా హాజరైన మహిళ లోకం..
  • వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు..
  • స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నీలం మధు…
  • నీలం మధు సమక్షంలో ఎన్ఎమ్ఆర్ యువసేనలో
    చేరిన బొంతపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే దీప..
  • వచ్చే ఎన్నికల్లో నీలం మధు వెంటే మా పయనం అంటూ ప్రకటన..
  • పటాన్ చెరు టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్..

ఏ నాయకుడికైనా స్థానిక ప్రజల మద్దతు కొంతకాలమే ఉంటుంది.. కాలం దానిని మరుగున పరుస్తుంది.. కానీ ఇక్కడ పరిస్థితి వేరు.. కాలమే ముందుండి రోజు రోజుకీ ఆ నాయకుడికి మద్దతును పెంచుతోంది.. ఇది ఏ కొద్దిమందికో సాధ్యం అవుతుంది.. అలాంటి కోవలోకే వస్తారు నీలం మధు.. ప్రజాసేవే శ్వాసగా బ్రతికే ఆయనకు ప్రకృతి కూడా సహకరించడం ఎంతో గొప్ప విషయం.. రోజు రోజుకి, నిమిష నిమిషానికి, ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి రాష్ట్రం యావత్తూ ఆశ్చర్యపోతోంది.. బీ.ఆర్.ఎస్. అధినేత ఈ పరిస్థితులు చూసి అయినా తన మనసు మార్చుకుంటాడని సబ్బండ వర్గాలు ఎదురు చూస్తున్నాయి..

హైదరాబాద్: గుమ్మడిదల మండలం, బొంత పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది మత్స్యశాఖ… వచ్చే ఎన్నికల్లో పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కి కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీలం మధుకి గ్రామంలోని సబ్బండ వర్గాల ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికి, రాఖీ కట్టి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం మధుకు ఏ పార్టీ టికెట్ కేటాయిస్తే ఆ పార్టీకే తాము మద్దతుగా నిలబడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి కేసీఆర్ ఒక్క టికెట్ కూడా కేటాయించకుండా, మొండి చెయ్యి చూపడం సరికాదన్నారు. గత నాలుగు ఏండ్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తూ.. తన సొంత నిధులతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహించిన నీలం మధుకి టికెట్ కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్ ఆలోచించి పటాన్ చెరు టికెట్ నీలం మదుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు అన్ని సబ్బండ వర్గాల ప్రజలు నీలం మధుకు అండగా నిలబడి గెలిపించుకుంటామన్నారు.

- Advertisement -

అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 65 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో మన జాతి బిడ్డలు ప్రవేశించినప్పుడే మన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పఠాన్ చెరు టికెట్ పై కేసీఆర్ పునర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అన్న ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. లేదంటే మీ అందరితో చర్చించి మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లేలా త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో మత్సశాఖ డైెక్టర్లులు వెంకటేశ్, మహేష్, శ్రీనివాస్, అధ్యక్షులు సత్యా నారాయణ, వార్డు సభ్యులు మల్లేష్, హరికృష్ణ, శంకర్, ఏల్లేష్,శంకర్, మల్లేష్, బిక్షపతి, రామకృష్ణ, మల్లేష్, వీరేష్, గోపాల్, నర్సింలు, శంకరయ్య, వెంకటేశ్, ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్యశాఖ సభ్యులు, మహిళలు, ఎన్.ఎం.ఆర్. యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు