Sunday, May 19, 2024

నాసా తొలి ఆస్టరాయిడ్‌ శాంపిల్‌ వచ్చింది

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్‌ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమికి తీసుకొచ్చింది. ఓసిరిస్‌ ఎక్స్‌ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోవిూటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్‌ క్యాప్సూల్‌ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక ప్రాంతంలో దిగింది. నమూనాను హ్యూస్టన్‌ లోని నాసా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించి.. వాటివిూద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని విూదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్‌ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్‌ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్‌ ఒక్కటే ఆస్టరాయిడ్‌ శకలాలను భూమికి తెచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు