Saturday, May 18, 2024

కాంగ్రెస్ పార్టీకి నాగం రాజీనామా

తప్పక చదవండి
  • నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి
  • కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి.. త్వరలోనే బీఆర్ఎస్ లోకి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జానా రెడ్డి లాంటి నేతల దృష్టికి తీసుకెళ్లిన టికెట్ పై హామీ దక్కలేదు. కాగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి ఆకస్మికంగా కాంగ్రెస్ టికెట్ కేటాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాగం ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో, అనుచరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు నాగం స్పష్టత ఇచ్చారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో నాగం చేరుతారని తెలుస్తోంది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు