Saturday, May 18, 2024

నర్సంపేట మున్సిపాలిటీలో మళ్లీ ముసలం..?

తప్పక చదవండి
  • చైర్‌పర్సన్‌ మార్చేందుకు కౌన్సిలర్ల కసరత్తు
  • బేరసారాలకు గ్రీన్‌ సిగ్నల్‌

నర్సంపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌): నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్‌ మార్చేందుకు మళ్లీ ముసలం ప్రారంభమైందని విశ్వాసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి నర్సంపేట పట్టణంలో సుమారు 5 వేల ఓట్ల మెజార్టీ తగ్గడంతో పట్టణ కౌన్సిలర్ల మీద మాజీ ఎమ్మెల్యే సైతం గుర్రుగా ఉండడంతో చైర్పర్సన్‌ మార్చేందుకు కౌన్సిలర్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో జూన్‌ ఒకటో తేదీన చైర్పర్సన్‌ వైస్‌ చైర్మన్‌ ను మార్చాలని ఉద్దేశంతో నర్సంపేట పట్టణానికి చెందిన పలువురు టిఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు హైదరాబాద్కు క్యాంపుకు వెళ్లి మూడు రోజులు నాన హల్చల్‌ సృష్టించారు. కాగా అప్పటి పరిస్థితుల వల్ల ఎమ్మెల్యే అవిశ్వాసానికి ఒప్పుకోకపోవడంతో క్యాంపు వదిలేసి కౌన్సిలర్లు పట్టణం బాట పట్టారు. నర్సంపేట మున్సిపాలిటీలో 24 మంది మొత్తం కౌన్సిలర్లు ఉండగా ఇందులో 18 మంది టిఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. చైర్‌ పర్సన్‌ కోసం బీసీ మహిళ రిజర్వ్‌ కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు నడిపిన గుంటి కిషన్‌ భార్య గుంటి రజనికి చైర్పర్సన్‌ అధికారం కట్టబెట్టారు. అనంతరం జరుగుతున్న పరిణామాలతో జూన్లో జరిగిన విపత్కర పరిస్థితికి ఇన్నాళ్లు కౌన్సిలర్లు మౌనం వహించినప్పటికీ మరో మారు అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఖర్చులు ఇంకా ఇతరత్రా లావాదేవీలు నర్సంపేట పట్టణానికి చెందిన మరో బీసీ మహిళ కౌన్సిలర్‌ ఇవ్వడానికి సైతం సుముఖంగా ఉన్నట్లు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది. నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ పాలకవర్గం మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ ఏడాదికి ముందే పట్టణ కౌన్సిలర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మళ్లీ పాత కథలాగే తిరోగమనం చెందుతుందా అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. కాగా గత జూన్లో చైర్పర్సన్‌ వైస్‌ చైర్మన్‌ ను తొలగించాలని డిమాండ్తో హైదరాబాద్‌ క్యాంపు నడిపిన కౌన్సిలర్లు నేడు ఒక్క చైర్‌ పర్సన్‌ మాత్రమే తొలగించాలని భీష్మించు కూర్చున్నట్లు విశ్వాసనియంగా తెలుస్తుంది.
చైర్‌పర్సన్‌ మార్చేందుకు కౌన్సిలర్ల కసరత్తు
బేరసారాలకు గ్రీన్‌ సిగ్నల్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు