Friday, May 17, 2024

సెలెబ్రిటీలు, రెండు రాష్ట్రాల ఔత్సాహికవ్యాపారవేత్తల చేతుల మీదగా ఎంబిఎఫ్‌ లాంచ్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కేంద్ర ప్రభుత్వ స్టార్ట్‌ అప్‌ ఇండియా స్ఫూర్తి తో 1280 మండలాల నుండి 1280 ఇండివిడ్యువల్‌ బిజినెస్‌ పర్సన్స్‌, రెండు తెలుగు రాష్ట్రాల్లో 101 స్టాక్‌ పాయింట్స్‌ మరియు 4 వేర్‌ హౌసెస్‌ తో చేయబడుతున్న ఎంబిఎఫ్‌ ద్వారా నిత్యావసర వస్తువులు, లాప్‌ టాప్‌, మొబైల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బట్టలు, వివిధ గిఫ్ట్‌ ఐటమ్స్‌ తక్కువ ధరలో ప్రజలకు జనవరి 2024 నుండి అందజేయనున్నారు. 2014 లో స్థాపించిన ఐఎస్‌ఓ సర్టిఫైడ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఓపెన్‌ డిజి యొక్క విన్నూత్న మార్కెటింగ్‌ స్టార్ట్‌ అప్‌ ద్వారా ‘1280 మండలాల నుండి 1280 స్టార్ట్‌ అప్స్‌ మరియు 3000 మందికి ఉపాధి’ సాధ్యం చేస్తున్నా మని, అని తెలిపారు. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల బిజినెస్‌ మెంటర్‌ శ్రీనివాస్‌ శరకడం డైరెక్ట్‌ మ్యానుఫ్యాక్చరర్లు నుండి ప్రోడక్ట్స్‌ అందడం వలన వినియోగ దారునికి కూడా తక్కువ ధరలో ఇచ్చేందుకు సాధ్యపడుతుందని అని తెలిపారు. ఈసందర్భంగా 5 రకాల పప్పులను, 6 కేజీల బాక్స్‌ గా దాల్‌ డీల్స్‌ కాంబో పేరుతొ రూపొందించబడిన ప్రోడక్ట్‌ ను ప్రముఖ సినీ నటి అప్సర రాణి, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ జస్వంత్‌ పడాల పాల్గొని లాంచ్‌ చేసారు. ఎంబిఎఫ్‌ మెంబర్స్‌ వారిని అవా ర్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల జిల్లాల నుండి 80ం స్టాకిస్టు లు, పిక్‌ పే ప్యాక్‌ బిజినెస్‌ హెడ్‌ పి రాకేష్‌, హైదరాబాద్‌ ఈవెంట్స్‌ సందీప్‌ చారీ, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ యర్రమ నేని ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఈవో శ్రీనివాస్‌ శరకడం మాట్లాడుతూ రైతుల దగ్గర నుండి సప్లై చేయడం ద్వారా మధ్యలో మిడిల్‌ మాన్‌ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా తక్కు వ మార్జిన్‌ తీసుకోవడం వల్ల, కస్టమర్‌ కి చాలా తక్కువ రేట్‌ కి ఇవ్వడం అనేది జరుగు తుందని అన్నారు. ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో ఎవరైతే ప్రోడక్ట్‌ సప్లయర్స్‌ ఉంటారో మీ మార్కెటింగ్‌ చేయడానికి మేము 100% హెల్ప్‌ చేస్తాము రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తాము అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు