Saturday, April 27, 2024

మథుర శ్రీకృష్ణజన్మభూమి సమస్య

తప్పక చదవండి
  • అలహాబాద్‌ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి షాహీ ఈద్గా మసీదుకు కమిషన్‌ను నియమిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అంశంపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ కేసులోని వాది ప్రతివాదుల అభ్యర్ధనలను వ్రాతపూర్వక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి జన్మభూమి వివాదానికి సంబంధించి అలహాబాద్‌? హైకోర్టు నియమించిన కమిషన్‌? విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లహాబాద్‌ హైకోర్టు మసీదు ప్రాంగణంలో సర్వేను పర్యవేక్షించేందుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించేందుకు అంగీకరించింది. ఈ ఆలయం ఒకప్పుడు హిందూ దేవాలయంగా ఉండేదని సూచించే గుర్తులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు