Saturday, July 27, 2024

రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

తప్పక చదవండి
  • అనుమతుల్లేని క్లినిక్,​ మెడికల్ దుకాణం సీజ్

ఈ లోకంలో దేవుని తర్వాత దైవంగా కొలిచేది డాక్టర్​నే. కానీ దాన్నే ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ఆకతాయిలు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నకిలీ డాక్టర్లు, అనుమతుల్లేని మెడికల్​ దుకాణాలు తెర పైకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సామాన్యుడు ఆలోచించకుండా ఖర్చు చేసేది ఒక్క తన ఆరోగ్యం, వైద్యం విషయంలో మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రుల వైఫల్యమో లేక ప్రైవేటు ఆసుపత్రులపై ఉన్న నమ్మకమో కానీ ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా ప్రైవేట్​ ఆసుపత్రులకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదే కొంతమందిని నకిలీ డాక్టర్లుగా అవతారమెత్తిస్తుంది. అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా, ఇలాంటివి బయటకు వస్తూనే ఉండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న ఓ క్లినిక్​తో పాటు మరో ప్రాంతంలో మెడికల్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాటితో పాటు రూ.లక్షా 90 వేల విలువ కలిగిన వివిధ బ్రాండ్ల మందులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో క్వాలిఫికేషన్​తో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా డి.శ్రీనివాస్ అనే వ్యక్తి క్లినిక్​ను నడుపుతున్నాడు. దీన్ని గుర్తించిన అధికారులు క్లినిక్​ను సీజ్ చేసి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్​లో మొత్తం 41 రకాలు కలిగిన టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వాటిని సీజ్ చేసిన అధికారులు, మందుల విలువ దాదాపు రూ.70 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు హైదరాబాద్​లోని ఫలక్​నుమా పరిధిలోని జంగంపేట్​లో అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనిని గుర్తించిన అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు. దుకాణంలో 40 రకాల మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా క్లినిక్, మెడికల్ దుకాణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా అనుమతుల్లేకుండా క్లినిక్​, మెడికల్​ దుకాణాలు నడిపితే మూసివేయాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు