- బండి సంజయ్ పై విరుచుకుపడ్డ మధుయాష్కి
- పొన్నం ప్రభాకర్ తో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు
- ఆయన నికార్సైన కమిట్ మెంట్ ఉన్న ప్రజా నాయకుడు
- రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసివి నీవు
- గౌడ్స్ తలచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కనబడకుండా పోతావు
బిజెపి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్కీ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలు వేరని కుటుంబం వేరని బండి సంజయ్ గుర్తుపెట్టుకుని వేదికల మీద మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ తల్లి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను మధుయాష్కీ తీవ్రంగా ఖండించారు.బీజేపీ నాయకులు నోరు విప్పితే సంస్కారం,క్రమశిక్షణ గురించి పెద్దగా ఉపన్యాసాలు ఇస్తూ మాట్లాడుతారని కానీ మాతృత్వాన్నిపంచె ఆమె పట్ల అగౌరవంగా మాట్లాడిన బండి సంజయ్ కుమార్ ఫై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అమ్మను కించపరిచే విధంగా బండి చేసిన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నావు-మధుయాష్కి
బండి సంజయ్ నీకు ఎన్ని గుండెలు ఒక బీసీ బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని నీవు బీసీలను ముఖ్యంగా మా గౌడ బిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావని మధుయాష్కి ఆరోపించారు. కేంద్రంలో అధికారం ఉందనే ధీమాతో కన్ను, మిన్ను కానకుండా అహంకారంతో ఇష్టానుసారంగా నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నావు.. ఈ మాటలు శృతిమించాయనే కాబోలు అధ్యక్ష పదవి పోగొట్టుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమిపాలయ్యావు.. పొన్నం ప్రభాకర్ తో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు, ఆయన నికార్సైన కమిట్ మెంట్ ఉన్న ప్రజా నాయకుడు,రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసివి నీవు,గౌడ్స్ తలచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కనబడకుండా పోతావు జాగ్రత్త . .. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల పై చిలుకు ఉన్న మా గౌడ సోదర సోదరీమణులు తలుచుకుంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేవని గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రభుత్వాలను కూడా శాసించే శక్తి మాకు ఉందని గుర్తుపెట్టుకో.. ..
ఏ పోరాటంలోనైన మేము ముందు ఉంటాము
సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మేము ఏ పోరాటంలోనైన ముందు ఉంటామని మధుయాష్కి గౌడ్ స్పష్టం చేశారు. అమ్మని గౌరవించలేని నువ్వు ఒక ప్రజా నాయకుడిగా కొనసాగే అర్హతలేదని విమర్శించారు.. కాంగ్రెస్ నాయకుల గురించి వారి కుటుంబసభ్యుల గురుంచి నీచంగా మాట్లాడే నీ తీరును యావత్ తెలంగాణ సమాజం చిదరించుకుంటుందని అన్నారు. ఒక జాతీయ పార్టీలో జాతీయ నాయకునిగా ఉంటూ ఒక పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న నీకు సంస్కారం లేకపోవడం బాధాకరమని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఎలా గెలుస్తావో మేము చూస్తాం. నాయకుడంటే హుందాగా వ్యవహరించాలి గాని చిల్లర మాటలతో ఇష్టానుసారంగా వేదికలపై మాట్లాడవద్దని హితువు పలికారు . బిజెపి పార్టీ స్పందించి నిన్ను పార్టీ నుంచి బహిష్కరించేంతవరకు మా పోరాటమాగదని మధుయాష్కీ గౌడ్ హెచ్చరించారు.