Friday, September 20, 2024
spot_img

బండి సంజయ్ ఖబర్దార్.. పొన్నం ని విమర్శించే స్థాయానీది కాదు..

తప్పక చదవండి
  • మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయనే ఎక్కడ
  • రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో
  • నీకు పొన్నంకు పోలికా ఆయన ఉద్యమ నేపథ్యమున్న నాయకుడు
  • తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయన పోరాటం మరువలేనిది
  • సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్
  • మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా నీ సంస్కారం
  • బండి సంజయ్ పై మండిపడ్డ తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్

బండి సంజయ్ ఖబర్దార్ పొన్నం ప్రభాకర్ ని విమర్శించే స్థాయాన్నిది అంత మొగోడివా ఆయన మాతృమూర్తి ని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడిన బండి సంజయ్ ని బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపకులు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడాడని, ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని అయన అన్నారు. నిత్యం దైవ నమస్మరణ, ఆలయాల సందర్శన, హైందవ సంకృతి సంప్రదాయాలను నిక్కచ్చిగా పాటించే నిఖార్సైన హిందువు పొన్నం ప్రభాకర్ అనే విషయాన్ని బండి సంజయ్, బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి అయన హితవు పలికారు. రాముడిని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయన ఎక్కడ రాజకీయ లబ్ది కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని, అయన బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వసూళ్ల రాజకీయాలు అందరికి తెలిసినవేనని విమర్శించారు. పొన్నం ప్రభాకర్ మాతృమూర్తి ని అవమానపరుస్తావా ఈ సంస్కారం మాతృమూర్తుల పట్ల అన్నారు.బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు కూడా అసహ్యించుకుంటున్నాయని, కరీంనగర్ సహా రాష్ట్ర ప్రజలందరూ సంజయ్ ను ఛీ కొడుతున్నారని, సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరిస్తేనే బీజేపీ పరువు నిలబడుతుందని, లేదంటే తగిన మూల్యం తప్పదని అయన హెచ్చరించారు. హిందూత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నిజంగానే భారతీయ సంస్కృతికి విలువ ఇస్తుందని నిరూపించుకోవాలంటే తక్షణం సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరించాలని అన్నారు. సొంత పార్టీ ఎంపీ అలా అమ్మతనాన్ని అవమానించేలా మాట్లాడుతుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని, తమ జాతీయ నాయకత్వం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ లో ఉన్న క్రమశిక్షణ అని ఎద్దేవా చేశారు.

సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పున్నం ప్రభాకర్

- Advertisement -

సర్దార్ సర్వాయి పాపన్న పౌర్షానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజకీయంగా సామాజికపరంగా ఆయన సేవలు అమోఘం ప్రతి వ్యక్తిని చిన్నవారైనా పెద్దవారైనా అన్న అంటూ ఆప్యాయంగా పిలిచే నాయకుడు ఆయన పొన్నం ప్రభాకర్ అంటే కరీంనగర్ ప్రజలకు అత్యంత వ్యక్తిగా ఆయనను భావిస్తారు. అధికారం కోసం రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు వింటుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆయన తెలంగాణ ప్రజల్లో సీనియర్ రాజకీయ వేత్తగా, బలమైన బీసీ నాయకుడిగా, కార్యదక్షుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీల బృందానికి నాయకత్వం వహించారని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన వెంటనే బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన తెలిపారు

సంజయ్ ను బిజెపి నుండి బహిష్కరించాలి లక్ష్మణరావు గౌడ్

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని అలాంటిది తమ పార్టీ నాయకులు సాటి బీసీలను అవమానపరుస్తుంటే చోద్యం చూస్తుందంటూ ఆయన మండిపడ్డాడు బండి సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరించాలని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెంటనే అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనీ, జాతీయ నాయత్వం అతని కామెంట్స్ ను పరిశీలించి పార్టీ నుండి వెంటనే బహిష్కరించాలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క బిసి ఓటు కూడా బీజేపీ కి పడదని, రాష్ట్రంలోని బీసీలు ఐక్యంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకుండా చేస్తామని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు