Monday, April 29, 2024

హెచ్ఎండిఏ అధికారుల అవినీతి లీలలు

తప్పక చదవండి
  • కుంట స్థలంలో హెచ్‌ఎండిఎ లేఅవుట్‌కి అనుమతి
  • లేఅవుట్ ప్ర‌క్క‌న కుంట స్థ‌లాన్ని ఆక్ర‌మించిన రియ‌ల్ట‌ర్‌
  • వాటర్ బాడీస్ లేవంటూ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్.శశికళ రిపోర్ట్
  • రియాల్ట‌ర్‌తో కుమ్మ‌కై అనుమ‌తిచ్చిన హెచ్ఎండీఏ అధికారులు
  • అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని అడిష‌న్ క‌లెక్ట‌ర్‌కు ఇరిగేష‌న్ అధికారుల‌ లేఖ
  • త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్‌. శ‌శిక‌ళ‌పై చ‌ర్య‌లు శూన్యం

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హెచ్ఎండిఏ ప‌రిధిలో ఉన్న చెరువుల‌ను కుంట‌ల‌ను రియాల్ట‌ర్లు అప్ప‌టి నాయ‌కుల‌తో కుమ్మ‌కై య‌ధేచ్ఛ‌గా క‌బ్జా చేస్తూ.. రియ‌ల్ ఎస్టేట్ దందాకు తెర లేపి కోట్ల రూపాయాలు దండుకున్నారు. అలాంటి ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు హెచ్ఎండిఏ అధికారులు సైతం అమ్యామ్యాలు తీసుకొని చెరువులు, కుంట‌ల స్థ‌లాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదం వ‌ల్ల ప్ర‌జ‌లు వారి నాయ‌క‌త్వాన్ని తిరస్క‌రించ‌డం జ‌రిగింది. నూత‌నంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అలాంటి భూ బ‌కాసురుల‌ను, అవినీతి అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో రేవంత్ రెడ్డి స‌ర్కార్ పేర్కొన‌డం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికి హెచ్ఎండీఏలోని అవినీతి అధికారులు వారి ప‌ద్ద‌తి మార్చుకోకుండా అవినీతికి పాల్ప‌డుతూ ప్ర‌భుత్వ ఖ‌జానాకు గండి కొడుతూ.. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే చెరువులు, కుంట‌ల‌లో అక్ర‌మంగా లేఅవుట్ల‌ అనుమ‌తులు ఇవ్వ‌డం విస్మ‌యాన్ని క‌లిగించింది.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండల పరిధిలోని కీసర దాయర రెవెన్యూ సర్వే నెంబర్లు 179, 213 లలో హెచ్ఎండిఏ లేఅవుట్‌కి (లేఅవుట్ పర్మిట్ నెంబర్‌ : 000005/ఎల్ఓ/పిఎల్‌జి / హెచ్ఎండీఏ / 2024 ) హెచ్ఎండిఏ అధికారులు సరైన పరిశీలనలు చేయకుండానే అనుమతులు ఇచ్చారు. సర్వే నంబర్‌ 179 లో చాకలి లక్ష్మయ్య కుంట (హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్: 2700/ఈఎన్‌/12 ) ఉన్నా కూడా లేఅవుట్ ఏర్పాటుకు హెచ్ఎండిఏ అధికారులు గుడ్డిగా అనుమతులు మంజూరు చేశారు. కుంటను మూసేయడంతో పాటు పక్కనే ఉన్న సర్వే నంబర్ 212 లోని ప్రభుత్వ భూమిలోకి జరిగి లేఅవుట్ పార్కు స్థలాన్ని ప్రభుత్వ భూమిలో చూపే ప్రయత్నం రియల్టర్ చేయడం గమనార్హం.

- Advertisement -

లేఅవుట్ కు అనుకొని చాక‌లి ల‌క్ష్మయ్య కుంట ఉన్న‌ప్ప‌టికి ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్. శ‌శిక‌ళ రియాల్ట‌ర్‌తో లోపాయ‌కారి ఒప్పందం చేసుకొని, 200 మీట‌ర్ లోప‌ల‌ వాట‌ర్ బాడీ ఉన్న‌ప్ప‌టికీ లేన‌ట్లు హెచ్ఎండీఏ అధికారుల‌కు శ‌శిక‌ళ నివేదిక స‌మ‌ర్పించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. ఈ విష‌యంపై స్థానిక ప్ర‌జ‌లు ఇరిగేష‌న్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళ‌డంతో వారు మోకను ప‌రిశీలించి, చాక‌లి ల‌క్ష్మ‌య్య కుంట‌ను ఆక్ర‌మించి రియాల్ట‌ర్లు లేఅవుట్ చేస్తున్న‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింది. కుంట విస్తీర్ణాన్ని స‌ర్వే చేయించి, వాట‌ర్ బాడీని డీమార్కేష‌న్ చేయ‌డం జ‌రిగింది. రియాల్ట‌ర్‌ కె. అవినాష్ కు హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌కు ఇరిగేష‌న్ అధికారులు
లేఖ రాశారు. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు గ్ర‌హించి హెచ్ఎండీఏ అధికారులు అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని, అవినీతి అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక ప్ర‌జ‌లు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు