Sunday, May 19, 2024

స్మార్ట్‌ సిటీ పనుల్లో నాణ్యత లోపం..

తప్పక చదవండి
  • పట్టించుకోని మున్సిపల్‌ మేయర్‌, అధికారులు..
  • ఇంజనీరింగ్‌ విభాగంలో అవినీతి అధికారులను సస్పెండ్‌ చేయాలి
  • స్మార్ట్‌ సిటీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి పై విచారణ జరిపించాలి
  • సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్‌ ; కరీంనగర్‌ నగరంలో స్మార్ట్‌ సిటీ పనుల్లో నాణ్యత లోపించిందని దీన్ని పట్టించుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అవినీతికి అలవాటు పడి తుంగలో తొక్కుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు విమర్శించారు. శనివారం రోజున కరీంనగర్‌ నగరంలోని అలకాపురి కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్డు కు పగుళ్లు రావడంతోదీనినిసిపిఐ నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి,పైడిపల్లి రాజు మాట్లాడుతూ అలకాపురి కాలనీలో వేసినటువంటి రోడ్డుపై పగుళ్లు వచ్చాయని కాంట్రాక్టర్‌ ఏమాత్రం నాణ్యత పాటించలేదని వేసిన రోడ్డుపై కనీసం నీరు పోయడం లేదని నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నగరంలో రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్‌ అధికారులను మేయర్‌ మందలించకపోవడం పలు అనుమానాలకు భావిస్తుందన్నారు. కరీంనగర్‌ నగరంలో ఎక్కడ కూడా స్మార్ట్‌ సిటీ పనులు పూర్తిగా నాణ్యత పాటించలేదని కొద్ది రోజుల్లోనే పగుళ్లు వస్తున్నాయని, రోడ్డు పక్కన వేసినటువంటి టైల్స్‌ లేస్తున్నాయని దీనిని ఏ మునిసిపల్‌ అధికారి కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.నగరంలో ఎక్కడ చూసినా పనులు అసంతృప్తిగా నడుస్తున్నాయని కోతి రాంపుర్‌ రోడ్డు ప్రారంభమై దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ రోడ్డు వేయకపోవడం దారుణమని దీనిపై కనీసంమేయర్‌, కార్పొరేటర్‌ కి చలనం లేకపోవడం చూస్తుంటే ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలపై ఏ విధమైన ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. రోడ్డు ఐదు నెలల నుంచి కాకపోవడం వల్ల కోతి రాంపూర్‌ ప్రజలు రోడ్డుపనుల జాప్యం వల్లఅనేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందుల పట్ల స్థానిక కార్పొరేటర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్‌ నగర్‌లో గత 40 రోజులకు పైగా ప్రధాన రహదారిపాత సిసి రోడ్డు తవ్వారని కానీ కొత్తరోడ్డు మాత్రం వెయ్యలేదని రోడ్డుపై వెళుతుంటే దుమ్ము దూళితో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కార్పొరేటర్‌ కి రోడ్డు చేపించాలనే చిత్తశుద్ధి లేకపోవడం పట్ల వారు ధ్వజమెత్తారు. కనీసం రోడ్డు నీరు పట్టైనా ప్రజల ఇబ్బందులను ఎంతోకొంత తగ్గించొచ్చు కానీ ఆ ప్రయత్నం కూడా కార్పోరేటర్‌ చేయకపోవడం చూస్తుంటే ప్రజల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థల్లో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కొంతమంది అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసి కూర్చున్నారని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్‌ విభాగం పూర్తిగా అవినీతి అడ్గాగా మారిందని నాణ్యతలేని ఇసుకను స్మార్ట్‌ సిటీ పనులకు వినియోగించడంతో చాలా రోడ్డు ఇప్పటికే దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్డు వేయకుండానే బిల్లులు తీసుకుంటారని ఇప్పుడు ఆయా రోడ్లలోఅర్ధరాత్రి వేస్తున్నారని ఆక్రోషమ్‌ వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించని వారి లైసెన్సులు రద్దుచేసి వారిని బ్లాక్లిస్టులో పెట్టి అవినీతి అధికారులను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రోడ్డును పరిశీలించిన వారిలో సిపిఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కిన్నెర మల్లమ్మ, న్యాలపట్ల రాజు, నునావత్‌ శ్రీనివాస్‌, సాయి,శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు