కొలంబో: ఆసియాకప్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు, శ్రీలంకతో నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అయితే వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన ఇండియన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. 88 వన్డేల్లో అతను 150 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 25.64 యావరేజ్‌తో అతను వికెట్లను పడగొట్టాడు. కుల్దీప్ వన్డేల్లో ఏడు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు అయిదు వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో ఇండియా తరపున వేగంగా 150 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. గతంలో షమీ 80 మ్యాచుల్లోనే ఆ రికార్డును సాధించాడు. అయితే ఈ మైలురాయి అందుకున్న తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా 150 వికెట్లు తీసిన స్పిన్నర్లలో కుల్దీప్ నాలుగో వ్యక్తి. ఆ జాబితాలో అజంతా మెండిస్(84 మ్యాచ్‌లు), రషీద్ ఖాన్(80), సక్లెయిన్ ముస్తాక్(78) ఉన్నారు. ప్రస్తుతం ఆసియాకప్‌లో 9 వికెట్ల తీసిన కుల్దీప్.. టోర్నీలో లీడింగ్‌లో ఉన్నారు.