Sunday, May 19, 2024

ఢిల్లీ 5 స్టార్ హోట‌ల్‌ తాజ్ ప్యాలెస్ లో అనుమానస్పదం…

తప్పక చదవండి

న్యూఢిల్లీ: ఢిల్లీలో జ‌రిగిన జీ20 స‌మావేశాల‌కు చైనా ప్ర‌తినిధులు హాజ‌రైన విష‌యం తెలిసిందే. తాజ్ ప్యాలెస్ హోట‌ల్‌లో బ‌స చేసిన ఆ ప్ర‌తినిధుల వ‌ద్ద ఉన్న రెండు బ్యాగులు క‌ల‌క‌లం సృష్టించాయి. విభిన్న‌మైన ఆకృతిలో ఉన్న ఆ బ్యాగ్‌ల‌ను పూర్తిగా చెక్ చేయాల‌ని సెక్యూర్టీ సిబ్బంది కోరింది. కానీ డిప్లమాటిక్ ప్రోటోకాల్ అంటూ చైనా అధికారులు ఆ బ్యాగ్‌ల‌ను చెకింగ్ కోసం ఇవ్వ‌లేదు. అయితే ఆ చైనా ప్ర‌తినిధుల రూమ్‌లో ఉన్న బ్యాగుల్లో అనుమానాస్ప‌ద ప‌రిక‌రం ఉన్న‌ట్లు హోట‌ల్ సిబ్బంది ఒక‌రు గుర్తించారు. సెక్యూర్టీ శాఖ ఆ బ్యాగుల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించింది. స్కాన‌ర్ ద్వారా బ్యాగుల‌ను చెక్ చేయాల‌ని అధికారులు భావించినా.. చైనా ప్ర‌తినిధులు ఆ బ్యాగ్‌ల‌ను అప్ప‌గించ‌లేదు. దాదాపు 12 గంట‌ల పాటు అధికారులు ఆ బ్యాగ్‌ల‌ను చెక్ చేసేందుకు ఎదురుచూశారు. చిట్ట‌చివ‌ర‌కు ఆ బ్యాగ్‌ల‌ను ఎంబ‌సీకి పంపేందుకు చైనా అధికారులు అంగీక‌రించారు. సుదీర్ఘ చ‌ర్చ‌, సంభాష‌ణ‌ల త‌ర్వాత ఆ బ్యాగుల‌ను ఎంబ‌సీ త‌ర‌లించేందుకు ఒప్పుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు