Tuesday, October 3, 2023

షాపింగ్‌ మాల్స్‌ ధగధగ.. చిరు వ్యాపార బ్రతుకులు వెలవెల

తప్పక చదవండి

ఇటీవల కాలంలో మహానగరాలతో పాటు జిల్లాస్థాయి పట్టణాలలో కూడా ‘డీ మార్ట్‌’, ‘రిలయన్స్‌’,‘బిగ్‌ బజార్‌’ మొదలైన షాపింగ్‌ మాల్స్‌ అనేకం వివిధ బ్రాంచీలతో విస్తరిస్తున్నాయి. దీనికి తోడు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ల విస్తరణ పెరగటంతో, అమేజాన్‌ లాంటి బహుళ జాతి సంస్థలు రంగ ప్రవేశం చేశాయి.ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌ లైన్‌ లో వినియోగదార్ల అవసరాలు తీర్చటానికి రీటైల్‌ రంగంలో అడుగు పెట్టాయి. క్రమంగా నానాటికి విస్తరిస్తూ లక్షల మిలియన్‌ చదరపు అడుగులలో ఈ షాపింగ్‌ మాల్స్‌ పెద్ద, పెద్ద అడుగులతో విస్తరిస్తున్నాయి. మరింత వివరాలలోకి వెళితే వీటికి దేశవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌ కు ఎనలేని డిమాండ్‌ పెరుగుతుంది.వీటి పెరుగుదలకు అడ్వర్‌ టైజ్మెంట్‌ సంస్థల యాడ్స్‌,హోర్డింగ్‌ లు, టివి ప్రకటనలు,వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆన్‌ లైన్‌ వ్యాపార ప్రకటనలు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఈ షాపింగ్‌ మాల్స్‌ కల్చర్‌ కూడా బాగా పెరుగుతుంది. వీటిని ఏర్పాటు చేయటానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీలు పడున్నాయి. 2027 నాటికి మన దేశలో ఏడు మెట్రో నగరాల్లో షాపింగ్‌ మాల్స్‌ కు డిమాండ్‌ 43 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని జోన్స్‌ లాంగ్‌ లా సేల్‌ (జెఎల్‌ఎల్‌)ఇండియా, తాజాగా వెల్లడిరచింది. ‘ఇండియా రిటైల్‌ : ఎవాల్వింగ్‌ టు ఏ న్యూ డాన్‌’ అనే పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో భారత్‌లో షాపింగ్‌ మాల్స్‌ కు ఉన్న డిమాండ్‌ ను విశ్లేషించింది. ప్రస్తుతం ఢల్లీి, ముంబై, పూణే, బెంగళూరు, కోల్‌ కతా, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ప్రస్తుతం 89 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో కొత్తగా మరో 38 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో దేశ రాజధాని ఢల్లీి నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌ సీఆర్‌) లోనే 28 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ మాల్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది.కాగా 2027 నాటికి కొత్తగా మరో 11.6 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ రాబోతున్నాయని పేర్కొంది. అలాగే, బెంగళూరులో 4.97 మిలి యన్‌ చదరపు అడుగులు, చెన్నైలో 6.23 చదరపు అడుగులు, హైదరాబాదులో 5.48 మిలియన్‌ చదరపు అడుగులు, కోల్‌ కతాలో 2.98మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ రాబోతున్నాయని పేర్కొంది.అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో 2.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ మాల్స్‌ రానున్నాయి. అలాదే, పూణేలో కూడా 2.32 మిగిలిన చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా, దేశీయ రిటైల్‌ రంగం దీనదినాభివృద్ధిని నమోదు చేసుకుంటూ ముఖ్యంగా కస్ట మర్లకు నూతన షాపింగ్‌ అనుభవం కల్పించడానికి యజమానులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారని జోన్స్‌ లాంగ్‌ లా సేల్‌ (జె.ఎల్‌. ఎల్‌.) ఇండియా హెడ్‌ రాహుల్‌ ఆరోరా తెలిపారు. అయితే పాశ్చ్యాతీకరణ, నగరీకరణ విస్తరణతో ఈ షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొదట్లో మహా నగరాల్లో, కార్పో రేట్‌ నగర పరిధిలో స్థాపించబడి సమాజంలో, ఆర్ధికంగా ఉన్నత వర్గాల ప్రజలకు మాత్రమైన అందుబాటులో ఉండేవి. క్రమంగా ఇవిఎగువ,దిగువ మధ్యతరగతి ప్రజలను కూడా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చేతివృత్తులు నశించడం, పిల్లల విద్య, వైద్య,ఉద్యోగ, ఉపాది అవసరాలకోసం ప్రజలు గ్రామాలను విడిచి నగారాల వలస బాట పడుతున్నారు. నగరాల సంఖ్య బాగా పెరిగి పోతుంది. ప్రజల అవసరాలకోసం ఆకర్షణీయ షాపిగ్‌ మాల్స్‌ ఊరూరా వెలసి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులను (ప్రజలను) కూడా ఆకర్షించి తన బుట్టలో వేసుకుంటున్నాయి. ఇక్కడ దాదపు దొరకని వస్తువు లేదు. అన్నిరకాల వస్తువులు,గృహ సామాగ్రి, పరికరాలు, పండ్లు,కూరగాయలు,పాల ఉత్పత్తులు, కిరాణం సామాగ్రి ఒకే చోట ప్యాకింగ్‌ చేసి లభిస్తున్నాయి.ఏసీ, రంగు రంగుల దీపాల వెలుగులో ఆకర్షణీయంగా పరిసరాలు ఉంటాయి. క్యాష్‌, క్రెడిట్‌, డెబెట్‌ కార్డులతో వస్తువులు కొనుగోలు చేయవచ్చు.ఆన్‌ లైన్‌ యాప్‌ ల ద్వారా పేమెంటు చేయవచ్చు.
ఒకే వస్తువు అనేక రంగుల్లో, సైజుల్లో, వివిద మోడల్స్‌లో, వివిధ బడా బ్రాండ్‌ కంపెనీల ఉత్పత్తులు విరివిగా దొరుకుతాయి. ప్రతి వస్తువు పై నిర్ణీత ధర ఉంటుంది. కొన్నింటి పై డిస్కౌంట్‌ లు కంపెనీలు ప్రకటించేవి పరిమిత కాలానికి లభిస్తాయి. ధరల విషయంలో వినియోగదారుడి బేరసారాలకు అవకాశం లేదు. అప్పుకు (ఉద్దరకు) స్థానం లేదు. పైగా అలా అడగడం ‘నామోషీ’ కూడా. ఒక వస్తువు కొనడానికి పోయిన వినియోగ దారుడు, ఆషాపిగ్‌ మాల్‌ మాయాజాలంలో చిక్కుకొని, ఏదో ఒక వస్తువును తనకు ప్రస్తుతం అవసరం లేకున్నా భవిష్యత్తులో అవసరం రాకపోతుందా అన్న భ్రమలో పడి కొనేస్తాడు. అనేక వస్తువులు, బ్రాండులు ఒకే సారి మన కండ్ల ముందు జిగేల్మంటూ దర్శనం కావడంతో వినియోగ దారుడు అయోమయంలో పడిపోతాడు. వివిధ వస్తుల ప్రదర్శన శాలలో ఏది కొనాలో తెలియక తికమకపడి ఏదో ఒక వస్తువును తప్పక కొనుగోలు చేస్తాడు. ఇలా వినియోగదారుని సమ్మోహన పరిచి, సంభ్రమాచ్ఛ ర్యాలకు గురిచేసి ఏదోక వస్తు వును కొనుగోలు చేసేలా ప్రేరేపించడమే వ్యాపార కళకు పరాకాష్టషాపింగ్‌ మాల్స్‌ వల్ల నష్టాలు: ఒకప్పుడు షాపు యజమా నితో వినియోగదారునికి మానవ సంబ ంధాలు ఉండేవి. పరస్పర నమ్మకం, రుణ సౌకర్యం ఉండేవి. పల్లెల నుండి పట్ట ణాల వరకు కోమట్లు, మా ర్వాడీలు ఇతర రాష్ట్రాలలో పలు పేర్లతో పిలవబడే వ్యాపారులు ఉండే వారు. వారు తరతరా లుగా ఒకే కులం వారు వ్యాపారాలు చేసే వారు. కొద్దిపాటి లాభాలతో నాణ్యమైన సరుకును అమ్మేవారు. వ్యాపారికీ, వినియోగ దారునికీ శాశ్విత మానవ సంబంధాల బంధం ఉండేది. వ్యాపారి ఇంటి పేరుతో ఆవంశం న్యాయంగా వ్యాపారం చేస్తుంధి అనే భావం కొనుగోలు దారునికి ఉండేది. అలాగే ఆపదలో ఆదుకుంటూ వినియోగ దారుడు ఇవ్వాళ కాకున్న రేపైనా తన రుణం చెల్లిస్తాడనే నమ్మకం వ్యాపా రికి ఉండేది.
వ్యాపారికి దైవ భక్తి సహజంగా ఉండేది. వ్యాపారం న్యాయంగా చేయ్యాలి,నాణ్యమైన వస్తువులు, సేవలు అంధించి, వంశం ప్రతిష్ట నిలబెట్టాలనే తపన, దైవ భీతి వ్యపార కుటుంబా లకు ఉండేది. అది వారసత్వంగా లభించే ఒక ఉదాత్త గుణం. దానితో వ్యాపా రికీ, వినియోగ దారునికి ఉండే ఒక మానవ సంబంధం. పరస్పర నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా ఈ షాపింగ్‌ మాల్స్‌ కల్చర్‌లో నశించింది.
ఈ షాపింగ్‌ మాల్స వల్ల, ఆన్‌ లైన్‌ కొనుగోళ్ళ వల్ల మన దేశంలో సంప్రదాయ బద్దం గా తమ దుకాణాలకు కిరాయిలు చెల్లించి వ్యాపారం చేసుకొనే కోట్లా దిమంది,పెద్ద, మధ్యతరగతి, చిన్న కిరాణం వ్యాపారులు నష్టపోతు న్నారు. వారిపై ఆధారపడిన చిరు ఉద్యోగులు ఎకౌంటెంట్లు, గుమస్తాలు, ఇతర చిన్నపాటి ఉద్యోగులు ఇప్పుడు వ్యాపారాలు లేక వీధిన పడ్డారు. ఈ జీయస్టీ వంటి పన్నుల విధానం కూడా, జిల్లా, మండల గ్రామలలో ఉండే ఈ చిరు వ్యాపారును బాగా కృంగ దీసింది. కొనుగోళ్ళు బాగా దెబ్బతిన్నాయి. షాపుల కిరాయి పెరి గింది. గుమస్తాల కనీస వేతనాలు కూడా వ్యాపారు లకు భారమైం ది. దానితో నలుగురు గుమస్తాతో నడిచే షాపులు ఒకరి తో సరిపెట్టు కునే స్థతి వచ్చింది. ఇలా ఎన్నో కోట్ల మందిని, వారి కుటుంబాలను పోషించిన వ్యాపార సంస్థలు ఈ విదేశీ, స్వదేశీ షాపింగ్‌ మాల్స్‌ల విస్తరణా పెనుతుఫాన్‌ హోరులో కొట్టుకు పోతున్నాయి. మన దేశ ఆర్ధిక వ్యవస్థకు మూల మైన ఈ సంప్ర దాయ వ్యాపారులను వారి ఉన్నతి పై ఆధారపడి జీవించే చిరు ఉద్యోగులను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు