Tuesday, May 14, 2024

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ట్రాష్‌

తప్పక చదవండి
  • మళ్లీ అధికారం మాదే అన్న కేటీఆర్‌..
  • హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని ధీమా
  • కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న..
  • డిసెంబర్‌ 3న అధికారం మాదే ?

హైదరాబాద్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌ లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ’ ఈరకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్‌ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. హ్యాట్రిక్‌ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించిన మీడియా సంస్థలను కెటిఆర్‌ ప్రశ్నించారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్‌ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్‌ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. 70కి పైగా స్థానాల్లో గెలుస్తాం అని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్‌ కొడతామని కేటీఆర్‌ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని, ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.’మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్‌ కొడతాం. 2018 తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు