Saturday, March 2, 2024

ఓటర్లపై ఎస్‌.ఐ విష్ణు మూర్తి భూతు పురాణం

తప్పక చదవండి
  • నా కొడుకుల్లారా పీ….కి వచ్చారా
  • ఒక్కొక్కరి తాటతీస్తా అంటూ లాటితో ఊగిపోయిన ఎస్‌ఐ
  • పులి తండాలో ఎస్సై మధు నాయుడు కాలర్‌ పట్టుకున్న స్థానిక సర్పంచ్‌
  • చిలుకూరులో ధాన్యం కాపలా ఉన్న రైతుపై ఎస్‌ఐ దాడి
  • ఎస్‌ఐల తీరుపై ఓటర్లు,ప్రజలు ఆగ్రహం
  • డ్యూటీలు వదిలి సెల్ఫోన్‌ లతో కాలక్షేపం

హైదరాబాద్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివ్వెంల మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లపై స్థానిక ఎస్‌.ఐ విష్ణు మూర్తి ఆగ్రహ వ్యక్తం చేస్తూ వారిపై లాఠీ ఎత్తి నా కొడుకుల్లారా, నాటకాలు చేస్తున్నారా ఒక్కొకరి తోడ్కలు తీస్తా, ఓట్లు వేద్దానికి వచ్చారా (అసభ్య పదజాలంతో ) నోటికి వచ్చిన మాటలను మాట్లాడుతూ ఓటర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పందించిన ఓటర్లు ఎస్సై విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్థానిక తోటి సిబ్బంది ఓటర్లకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో కొద్దిసేపు పోలీసులకు ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. మేము మీ కొడుకులమా, ఎప్పుడు పుట్టాము, నువ్వు మా తండ్రివా అంటూ ఎస్‌ఐపై ఓటర్లు ప్రశ్నించారు. ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో(పోలీస్‌) ఉండి ఇలా ఓటర్లపై నోరు జారడం ఎంతవరకు సమంజసం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మర్యాదగా క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ ఎస్‌ఐ విష్ణుమూర్తి పట్టించుకోకుండా అక్కడినుండి మెల్లగా జారుకున్నారు. ఈ సంఘటనకు ముందు పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చిన ఎస్‌ఐలు వారి ఫోన్‌ లలో గంటల తరబడి మాట్లాడుతూ డ్యూటీ లు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ లో గొడవ అవుతుందని ఒక్కసారిగా వచ్చి ఓటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ విషయంపై చివ్వెంల గ్రామానికి చెందిన ఓటర్లందరూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఐ మదు కాలర్‌ పట్టుకున్న సర్పంచ్‌..
చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మీ నాయక్‌ తండా గ్రామంలో ఓటు వేయడానికి వచ్చిన పులి తండ సర్పంచ్‌ వీరన్న నాయక్‌ పై, ఎస్‌ఐ మధు నాయుడు అత్యుత్సాహం ప్రదర్శించి సర్పంచ్‌ పై చేయి వేసి పోలింగ్‌ కేంద్రం నుండి బయటకి తోసి వేయడంతో ఆగ్రహానికి గురైన సర్పంచి వీరన్న, ఎస్సై మధు నాయుడు కాలర్‌ పట్టుకుని తోసివేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిరది.అక్కడే ఉన్న స్థానిక ఉద్యోగులు,ఓటర్లు అడ్డుకొని సర్పంచ్‌ కి ఎస్‌ఐ కి నచ్చజె చెప్పారు. పులి తండాలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన తర్వాత మధు నాయుడు చివ్వెంల మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రం వెళ్లి,అక్కడ కూడా ఓటర్ల పై దురుసుగా ప్రవర్తించారని ఓటర్లు చెప్తున్నారు.ఈ సంఘటనలు అన్నిటికీ కారణం ఈ అధికారులు గత రెండున్నర సంవత్సరాలుగా అదే మండలంలో ఉద్యోగం చేస్తూ పెత్తనం చలాయిస్తున్నారు. అది చూసుకొని ఎవరిని లెక్కచేయకుండా ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లపై, ప్రజా ప్రతినిధులపై వారి హీరో ఇజం తో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్కడికి వచ్చిన ఓటర్లు చెప్తున్నారు. ఈ సంఘటనలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వరి ధాన్యం కావాలా ఉన్న రైతు పై ఎస్‌.ఐ దాడి..
మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో ఓ రైతు తన వడ్ల రాశి వద్ద కాపలా ఉండగా.. తను రైతునని చెప్పిన గాని వినకుండా ఆ రైతు(5వ వార్డు మెంబర్‌)ను చిలుకూరు ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ అకారణంగా అతన్ని ఈడ్చికెళ్ళి కొట్టారు.అకారణంగా రైతు పై దాడి చేసి గాయ పర్చిన ఎస్సైను సస్పెండ్‌ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.గ్రామస్తులు ఎస్సైను చుట్టుముట్టడంతో రైతుకు క్షమాపణ చెప్పి అక్కడినుండి జారుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు