Tuesday, May 21, 2024

మళ్లీ విఫలమైన ఎలక్షన్‌ కమిషన్‌

తప్పక చదవండి
  • ఓటు దక్కక నిరాశ చెందిన జనం
  • మల్కాజిగిరిలో చనిపోయిన వ్యక్తులకు ఓట్ల హక్కు కలిపించిన ఎలక్షన్‌ కమిషన్‌..
  • బ్రతికున్న ఎంతోమంది ఓట్లు గల్లంతు…
  • ఈసారి కూడా ఎలక్షన్‌ పని ఉత్తదే : మల్కాజ్గిరి సామాన్య ప్రజలు..

మల్కాజిగిరి : పేరు పెద్ద ఊరు దిబ్బ అనే మాటకు సరిగ్గా సరిపోతుంది మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎలక్షన్‌ కమిషన్‌ వ్యవహరించిన తీరు చూస్తే… ఎంతో ఆశతో ఓటు వేద్దాం అనుకున్నా ప్రజలకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చింది. 4- 5 సంవత్సరాల ముందు చనిపోయిన వారికి ఓట్లు వచ్చాయి కానీ,బతికున్న ఎంతో మందికి ఓట్లు రాకపోవడంతో ఎలక్షన్‌ కమిషన్‌ తీరని తప్పుపడుతూ నిరాశతో వెనుదిరిగారు.మరికొందరికి అయితే ఒకటే బూతులతో రెండు ఓట్లు వచ్చిన వైనం చూస్తే ఎలక్షన్‌ కమిషన్‌ పనితీరు ఎంత గొప్పగా ఉందో అని సామాన్య ప్రజలు నవ్వుకుంటున్నారు. గత సాధారణ ఎలక్షన్ల ఓట్లు లిస్ట్‌ లో, పాత సీసాలో కొత్త సారా నింపినట్టు, పాత లిస్టులో కొత్త ఓటర్ల లను చేర్చారు తప్ప,చనిపోయిన వారిని లిస్టులో నుండి తొలగించకపోవడమే కాక, ఎంతోమంది ఓట్లను గల్లంత చేశారు.ఈ మాత్రం దానికి ఎలక్షన్‌ కమిషన్‌ అవసరమా అని ఓట్లు గల్లంతయిన సామాన్య ప్రజలు ఎద్దేవ చేశారు.మరి ఎలక్షన్‌ కమిషన్‌ పనితీరు ఎప్పుడు మారుతిలో వారికే తెలియాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు