Saturday, May 4, 2024

ఎన్నికల బరిలోకి బీ.ఆర్.ఎస్. బాస్..

తప్పక చదవండి
  • సిద్దమైన సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్..
  • ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో విస్తృత పర్యటనలు..
  • ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో ముఖ్య సమావేశం..
  • అనంతరం అభ్యర్థులకు బి ఫారాలను అందజేత..
  • నవంబర్ 9న రెండు స్థానాల్లో నామినేషన్..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలుస్తోంది.. సమావేశం అనంతరం.. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాతి రోజున (అక్టోబర్ 16) జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 18న.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో గులాబీ బాస్ పాల్గొంటారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పెండింగ్‌లో ఉన్న మిగితా నాలుగు స్థానాల అభ్యర్థులను కూడా నేడో, రేపో ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు