Thursday, May 16, 2024

కట్టిపడవేసే ఏలూరు గోదావరి నది పరీవాహక ప్రాంతం..

తప్పక చదవండి
  • అక్కడ అందాలు కనువిందు చేస్తాయి..
  • ఎత్తైన కొండలు మధ్యలో గోదారి గలగలలు..

అమరావతి : అక్కడి ప్రకృతి అందాలు పర్యాటకలను కట్టిపడేస్తాయి. ఎటు చూసినా ఆహ్లాదకర ప్రదేశం, ఎత్తయిన కొండలు, మధ్యలో గోదావరి గలగలలు.. మరోపక్క ప్రశాంత వాతావరణం.. అయితే అలాంటి ఆహ్లాదకర వాతావరణం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..? అక్కడి ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.. ఏలూరు జిల్లా విలీన మండలం వెలేరుపాడు మండలం గోదావరి నది పరివాహక ప్రాంతం.. విలేరుపాడు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కట్కూరు అనే గ్రామం ఉంది. అయితే అక్కడ సుందర వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సంవత్సరం పొడుగునా కాలాలతో సంబంధం లేకుండా పచ్చదనం ఆ ప్రదేశంలో పరిమళిస్తుంది. అయితే ఒక్క గోదావరి ఉధృతి సమయంలో తప్ప మిగతా రోజులలో అక్కడికి సులభంగా వెళ్లవచ్చు. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో గోదావరి ప్రవాహం, నది ఒడ్డున కట్కూరు గ్రామం ఉంది. అలాగే మరొకవైపు కొండపై ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన శివాలయం అక్కడ మనకు దర్శనమిస్తుంది. చాలామంది పర్యాటక ప్రేమికులు ఆ ప్రదేశంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. వేలూరుపాడు నుంచి కట్కూరికి రోడ్డు మార్గం ద్వారా వెళుతుండగా కొండల నుంచి వచ్చే చల్లని గాలి, ఎత్తు పల్లాలతో చిన్నచిన్న గాటిల మాదిరిగా ఉన్న రహదారి, రహదారికి ఇరువైపులా పచ్చనీ పంటలతో సుందరంగా ఉండి మరో అరకుల ఆ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే మహాశివరాత్రి నాడు కొండపై శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరించి శివాలయంలో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తారు. శివాలయం ప్రాంతం నుంచి గోదావరి నదికి మరోవైపున ఉన్న కొండలు ఎంతో రమణీయంగా ప్రకృతి పరవశింప చేసేలా కనిపిస్తాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు