Monday, April 29, 2024

తెలంగాణలో అలజడి..

తప్పక చదవండి
  • ఐటీ రైడ్స్ తో అట్టడుగుతున్న రాష్ట్రం..
  • బీ.ఆర్.ఎస్. పార్టీలో మొదలైన టెన్షన్..
  • అదుపులో డెక్కన్ క్రానికల్ వెంకటరామి రెడ్డి..
  • డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్..
  • అందరి చూపు సూత్రధారుల వైపే…

( అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు )

తెలంగాణలో.. తెల, తెల్లవారుతుండగానే రాజకీయ, ఆర్థిక, సినీ వర్గాలు నిర్ఘాంతపోయే సంఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడ దొంగలు అక్కడ గప్ చుప్. ఫోన్లు ఎత్తితే ఒట్టు. ఒకటే టెన్షన్. ఎవరు వచ్చి ఎప్పుడు తలుపుగొడతారోనని ఒకటే అలజడి. వేల కోట్ల బాగోతాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. గులాబీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఆస్తులపై ఐటి దాడులు. రాజకీయ వర్గాల్లో రోజంతా ఒకటే ఉత్కంఠ. ఇక దేశ ఆర్థికవేత్తలలో దక్కన్ క్రానికల్ ప్రమోటర్ల అరెస్ట్ ఓ దుమారం లేపింది. అది రూ.8 వేల కోట్ల ఫ్రాడ్ తెలంగాణ కేంద్రంగా జరిగింది. అరడజను ఎఫ్ఐఆర్ లతో ఎట్టకేలకు అరెస్టులు జరిగాయి. సినీ వర్గాల్లో డ్రగ్ దుమారం మరోసారి రేగింది. కొకైన్ తో ‘కబాలి’ నిర్మాత అడ్డంగా దొరికాడు. గులాబీ ఆర్థిక నేతలపై జరిగిన దాడుల సూత్రధారి ఎవరనే ఊహాగానాలకు బుధవారం అర్థరాత్రికి ఒక దారం దొరికింది. రియల్ ఎస్టేట్ దందాలకు తోడు బంగారు, వస్త్ర వ్యాపారాలపై పెట్టిన బినామా పెట్టుబడులు లెక్కలు ఆందోళన కలిగిస్తంన్నాయి. వారికి చెందిన సోషల్ మీడియా గ్రూపులన్నీ మౌనవ్రతం పాటించాయి. ఈ కథనాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనాలు లోపటి పేజీల్లో….

- Advertisement -

ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్ఎస్లో ఎందుకంత టెన్షన్ అంటే..:
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ముందుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరిగాయి.. కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదల ప్రక్రియ కొనసాగింది.

డెక్కన్ క్రానికల్ వెంకట్ రామ్ రెడ్డి అరెస్ట్ :
డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్లను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామ్ రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిని నేడు కోర్టులో హాజరుపచిన అనంతరం రిమాండ్ కు పంపనున్నారు. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్ రామ్ రెడ్డి పై ఈడీ అభియోగాలు మోపింది.

పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్ రామ్ రెడ్డి పై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్ రామ్ రెడ్డి కి చెందిన రూ.. 3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో రూ. 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది.

డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ :
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా.. కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

కొంతకాలం డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పూరి జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించింది. చివరకు ఫోరెన్సిక్ నివేదికలో వీరంతా డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు