Sunday, September 8, 2024
spot_img

పటిష్టమైన నాయకత్వ లోపం..( ముదిరాజుల వెనుకబాటు తనానికి ఇదే కారణమా..? )

తప్పక చదవండి
  • 1970 లో అనంతరామన్‌ కమిషన్‌ ముదిరాజులను ‘విముక్తజాతులు’ గా గుర్తించింది..
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదు ఎందుకు..?
  • బీసీ కమిషన్‌ నివేదిక సమర్పించాలంటూ సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చిన కుల సంఘాలు..
  • ప్రభుత్వం, బీసీ కమిషన్‌ ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదు..!
  • రాష్ట్రం సాకారమైనప్పటికీ ముదిరాజుల బ్రతుకులు ఎందుకు మారడం లేదు..?
  • ముదిరాజుల వైఫల్యాలకు సంఘం, ప్రభుత్వం, బీసీ కమీషన్ లలో బాధ్యులెవరు..?

( చిద్రమైన ముదిరాజుల బతుకులపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.. )
ఒక విప్లవ కారుడు సమాజంలో సృష్టించే విధ్వంసం కంటే.. ఒక మేధావి మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరమైందని ఒక మహానుభావుడు సెలవిచ్చాడు. సరే ఆ మేధావి చెప్పిన మాటలు అటుంచితే.. తెలంగాణ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముదిరాజ్‌లు కొన్నెండ్లుగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ఉపాధి లేక బతుకు భారమై బతుకు కోసం అవకాశం దొరికే చోటుకు వలసబాట పడుతునే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయినప్పటికీ, ముదిరాజులకు పెద్దగా ఒరిగిందేమీలేదు. రాష్ట్ర జనాభాలో 17 శాతానికిపైగా ఉన్న ముదిరాజ్‌ కులస్థులకు ప్రభుత్వంలో అవకాశాలు అందనంత దూరంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2014 ఆగస్టులో చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ లెక్క ల ప్రకారం బీసీలలోని అన్నికులాలకం టే అత్యధిక జనాభా కలిగి ఉన్నది ఒక్క ముదిరాజులే. అటువంటి ముదిరాజ్‌ సామాజికవర్గ ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా కొన్నెండ్లుగా అనేక రకాల నమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

నెం.2 లీడర్ ఎందుకు సైలెంట్ అయ్యాడు..
ఈటల రాజేందర్‌ తెలంగాణ సమాజంలో పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు.. ఏర్పడిన తరువాత.. తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన.. వెలుగుతున్న ఓ ధ్రువతార.. తెలంగాణ రాజకీయాల్లో నెం.2 లీడర్ గా తన పేరును తానే చెక్కుకున్న అపర చాణక్యుడు. ఈటల రాజేందర్‌ నిజానికి లెఫ్టిస్ట్ భావజాలం కలిగి ఉన్న వ్యక్తిగా ప్రచారం ఉంది. అందుకే ఆయనకు కుల సంఘాలంటే పెద్దగా నచ్చవు. ముదిరాజుల సామజిక వర్గం నుంచి వచ్చిన ఈటల ఆ వర్గాన్ని దగ్గరికి తీసిన సందర్భాలు లేవనే చెప్పాలి. కుల సంఘాలు నిర్వహించిన సభలు సమావేశాల్లో అధికారికంగా, అనధికారికంగా ఆయన పాల్గొన్న సందర్భాలు మచ్చుకయినా లేవు. అటువంటి ఈటలకు బి ఆర్ ఎస్ నుంచి బర్తరఫ్‌ అనే సమస్య వచ్చినప్పుడు ముదిరాజ్‌ కుల అస్తిత్వాన్ని బహిరంగంగా నెత్తికెత్తుకున్నారు. ఈటల రాజేందర్‌ తన ఇరవయ్యి ఏండ్ల అధికార రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించిన సందర్భాలు లేవు. ముదిరాజుల రిజర్వేషన్‌ నమస్యలను, హక్కులను పరిష్కరించాలనే డిమాండ్ ఈటల రాజేందర్‌ నోటినుంచి వచ్చి ఉంటే ఈ పాటికే ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కార మార్గం దొరికేదని ముదిరాజుగా పిలువడుతున్న ఏ బిడ్డనడిగినా ఇట్టే చెబుతారు.

- Advertisement -

రాష్ట్రం సాకారమైనప్పటికీ ముదిరాజుల బ్రతుకులు మారలేదు :
తరతరాలుగా అనుభవిస్తున్నపేదరికంతోపాటుగా, పటిష్ట నాయకత్వం లేకపోవడం, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన నాయకత్వాలు స్వార్థ చింతనతో వ్యక్తి కేంద్రంగా పనిచేయడం, ముదిరాజుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరి ఫలితంగా వీరు మిగిలిన సామాజికవర్గాలతో సమాంతరంగా ఎదగలేకపోయరన్నది కఠోర సత్యం. రాజ్యాంగంలో హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్‌ సౌకర్యాన్నిఅనుభవించడంలోనూ ముదిరాజులు వెనుకబబడ్డారనే చెప్పాలి. అక్టోబర్‌ 11,2022వ తేదీన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఎ గ్రూపులోకి మార్చే విషయంలో వెలువరించిన తుది తీర్పుతో ముదిరాజులు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలతో పాటు రాజ్యాంగ హక్కులను అందుకోవడంలోనూ పూర్తి నిర్లక్ష్యా నికి గురవుతున్నారనే భావన మరింతగా బలపడింది.

నాటి నుంచి నేటి దాకా :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి, వారికి రాజ్యాంగబద్ధంగా అందించవలసిన రిజర్వేషన్‌ సౌకర్యానికి నంబంధించిన ప్రాతిపదికను రూపొందించడానికి 1968లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అనంతరామన్‌ చైర్మెన్‌గా అప్పటి ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ వివిధ సామాజికవర్గాల నుంచి వివరాలను సేకరించి 93 కులాలకు సంబంధించిన బీసీలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరించింది. విముక్త జాతుల కులాలను బీసీ-ఎ, వృత్తి కులాలను బీసీ-బి, దళిత క్రిస్టియన్లను బీసీ-సి, ఇతర కులాలను బీసీ-డి గ్రూపులుగా స్థిరీకరించింది. అనంతరామన్‌ కమిషన్‌ 1970లో సమర్పించిన తన నివేదికలో ముదిరాజులను ‘విముక్తజాతులు’ గా గుర్తించినప్పటికీ, రిజర్వేషన్‌ పరంగా ఇతర కులాల జాబితాలో బీసీ-డి గ్రూపులో ఎందుకు చేర్చబడ్డారో ఇప్పటికి అర్ధంకాని మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.

ముదిరాజుల్లో రాజకీయ చైతన్యం లేదు :
2009లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ- ఎ గ్రూపులోకి మారుస్తూ ‘జీఓ నంబర్‌ 15 ను తేదీ: 19.02.2009’ న వెలువరించారు. బీసీ-ఎ గ్రూపులోని కొన్ని కులసంఘాల నాయకులు ముదిరాజులను తమ కేటగిరిలో చేర్చడం వల్ల తమ అవకాశాలను కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వాళ్లు జీఓ నంబర్‌ 15 పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. స్టే కావాలని కోర్టును ఆశ్రయించారు. 2009 ఏప్రిల్‌లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలకు రెండునెలల ముందు ప్రభుత్వాన్ని ఒప్పించగలిగిన ముదిరాజ్‌ కులసంఘాల నాయకులు, ఎన్నికల అనంతరం హైకోర్టులో ఇదే అంశంపై తలెత్తిన వివాదం విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉండిపోయారు. ఎన్నికలకు ముందు ఎంతో ఉదారంగా ముదిరాజులకు మేలు చేసే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నట్లు వ్యవహరించిన ప్రభుత్వం అనంతరం ముదిరాజ్‌ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించలేకపోయింది.

కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పోరాడినా కనబడని ఫలితం :
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌.. ముదిరాజుల వెనుకబాటుతనంపై గట్టిగానే పోరాడారు. కొన్ని సందర్భాల్లో అయన తన అవకాశాలను.. రాజకీయ భవిష్యత్తును సైతం చేజార్చుకున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2010లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మూడు నెలలలో సమగ్ర నివేదికను సమర్పిం చాలని సుప్రీం కోర్టు 28.10.2010న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మార్చుతూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిన సందర్భంలోనూ, సుప్రీం కోర్టు నివేదిక అడిగిన సమయంలోనూ ముఖ్యమంత్రిగా
డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డే ఉన్నారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలోనే జస్టిస్‌ ధవళ నుబహ్మ ణ్యం బీసీ కమిషన్‌ చైర్మె న్‌గా (2004- 2011) వ్యవహరిం చారు. 2009 ఎన్నికలకు ముందు ముదిరాజులకు అనుకూలంగా నివేదిక సమర్పించిన ఇదే కమిషన్‌ హైకోర్టు కేసు సందర్భం లోనూ, సుప్రీం కోర్టు నివేదిక అడిగిన సందర్భంలోనూ ఎందుకు సానుకూలంగా స్పందించలేదనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.

బీసీ కమిషన్‌ వైఫల్యమే :
తెలంగాణ ప్రభుత్వం, బీసీ కమిషన్‌తోపాటుగా డా. బండా ప్రకాశ్‌ తో బాగస్వాములైన తర్వాత 2018 డిసెంబర్‌ నాటికి బీసీ కమిషన్‌ నుండి నివేదిక సమర్పించాలం టూ సుప్రీం కోర్టు ఆఖరి అవకాశం కల్పించింది. తెలంగాణ బీసీ కమిషన్‌ ఈ విషయంలో కనీసం స్పందించలేదు. 50 నెలల కాలం వృథా అయినప్పటికీ, సుప్రీం కోర్టులో ముదిరాజుల పక్షాన వాదిన్తున్న కుల సంఘాలుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, బీసీ కమిషన్‌గానీ ఈ విషయం లో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నామనే కీలక అంశం కూడా ముదిరాజ్ సంఘాల నాయకులు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీంతో
ముదిరాజుల హక్కులు పాతాళానికి తొక్కబడ్డాయి.

ఏండ్లు గడుస్తున్నా పురోగతి లేదు :
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 2010 డిసెంబర్‌ నాటికి ఇవ్వాల్సి న బీసీ కమిషన్‌ నివేదిక పదమూడు ఏండ్లు గడిచినా నేటికీ అతీగతీ లేదు. ఈ 13 ఏండ్ల కాలంలో ముదిరాజ్లు విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, ముదిరాజ్‌ సంఘాల నాయకులు కూడా బాధ్య త వహించాలి. సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వడంలో జరిగిన జాప్యానికి 2010 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని అధికారవర్గాలు సాకుగాచూపి తమ రాజ్యాంగ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నాలకు పూనుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలుగా (2014-2018, 2018- 23) జరిగిన ఎన్ని కల సందర్భంగా ముదిరాజుల రిజర్వే షన్‌ అంశాన్ని ప్రధాన చర్చనీయాంశంగా మార్చడంలో కుల సంఘాల ఉద్దండులు దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు