Sunday, May 5, 2024

దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా?

తప్పక చదవండి
  • ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా?…
  • నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా?
  • ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి?
  • పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు
  • కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో
  • తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ పిలుపు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేశారు. తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని సాక్షాత్తూ నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్… ఇచ్చిన మాట పూర్తిగా తప్పారు. గడువు ముగిసిన 3 నెలల తరువాత నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మాత్రమే మధ్యంతర భ్రుతి ఇస్తున్నట్లు ప్రకటించి వారికి అన్యాయం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు 3 డీఏలు (10.92 శాతం) పెండింగ్ లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భ్రుతి ఇచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని పదేపదే మొత్తుకున్న కేసీఆర్… స్వరాష్ట్రం వచ్చాక కేవలం 5 శాతం మధ్యంతర భ్రుతి ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? కేసీఆర్ పాలనా పుణ్యమా? అని 317 జీవో పేరుతో స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకీడుస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు లేక అల్లాడుతున్నరు. ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం.. ఉద్యోగులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టివేయడమే అవుతుంది.

ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, పీఆర్సీ అమలు దేవుడెరుగు 3, 4 నెలలకోసారి జీతాలు కూడా ఇవ్వలేని దుస్ధితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించి ఉద్యోగులకు మేలు కలుగుతుందని వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నా. కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు