Sunday, May 19, 2024

రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు పోరాట గిరిజన శక్తి విజయం..

తప్పక చదవండి
  • గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్..

హైదరాబాద్ : ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రో. మంగు నాయక్, తూటా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రో. రాజు పాడియా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రో. బాలు నాయక్, జెనెటిక్స్ ప్రో. విజయ్ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన శక్తి చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకొని, రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, వారి బృందానికి శాలువా, పూలదండలతో, స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి ఆర్ట్స్ కళాశాల ముందు సంబరాలు నిర్వహించడం జరిగింది. గిరిజన శక్తి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొనబడిన తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం బిల్లులో పెట్టడం జరిగింది.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2019లో ములుగు జిల్లా లకారం గ్రామం వద్ద 335 ఎకరాలను కేటాయించింది. తర్వాత ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల చొప్పున బడ్జెట్ లో కేటాయించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.. గిరిజన శక్తి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రాలలో అనేక సభలో సమావేశాలు నిర్వహించింది.. అదే విధంగా రెండుసార్లు చలో ఢిల్లీ కార్యక్రమంతో పార్లమెంట్ లో సైతం ఎంపీ రాంజీ గౌతమ్ చే మాట్లాడించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఎంపీలను కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.. మొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా 900 కోట్లతో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం స్వాగతిస్తున్నామని, ఆ రోజు చట్టంలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, భూమి కేటాయించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, అదే విధంగా మా పోరాటంలో ముందు నుంచి ఉన్న గిరిజన మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ఇతర గిరిజన సంఘాలకు, గిరిజన జాతి శ్రేయోభిలాషులకు గిరిజన శక్తి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలకు ధన్యవాదాలు.. అదే విధంగా రాబోయే రోజుల్లో గిరిజన హక్కుల సాధన కోసం గిరిజన శక్తి మరింత ముందుకు వెళ్లి పోరాటం చేస్తుందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ తెలిపారు. తూటా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రో.రాజు పాడియా మాట్లాడుతూ.. గిరిజన శక్తి పోరాటం వలన ఇవాళ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని రాబోయే రోజుల్లో గిరిజన శక్తి మరింత పోరాడాలని తూటా యొక్క పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ రమేష్ రాథోడ్, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజారాం నాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్, రాష్ట్ర కోఆర్డినేటర్ నందు నాయక్, కార్యదర్శి నరేష్ నాయక్, సంయుక్త కార్యదర్శి శివాజీ నాయక్, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బాసు నాయక్, సికింద్రాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు గణేష్ నాయక్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నవీన్ నాయక్, జనగామ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ నాయక్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు