Saturday, May 18, 2024

పాలమూరు ఎత్తిపోతలతో ఇబ్రహీంపట్నానికి సాగునీరు

తప్పక చదవండి
  • 24 గంటలకు విద్యుత్‌ అందజేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ..
  • తెలంగాణలో భారీగా పెరిగిన ఉపాధి అవకాశాలు
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
  • నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
  • బూత్‌ స్థాయి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి హరీష్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి…

ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదనీ , కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండిరగ్‌ ప్రాజెక్టులకు రీడిజైనింగ్‌ చేయిస్తున్నది. పాలమూరు ఎత్తిపోతలతో ఇబ్రహీంపట్నానికి సాగునీరు అందించి పట్నం సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. నియోజకర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతు న్నద న్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడాలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బూతు స్థాయి కమిటీల సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్‌ రావు తో పాటుగా , జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఇక సాగునీరు రావడమే ఆలస్యం అని , ఈ మధ్యన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని ఆ కాలువల ద్వారా వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేసుకుందామని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు. ఇబ్రహీంపట్నం , మహేశ్వరం నియోజకవర్గాల మధ్యలో మెడికల్‌ కాలేజీలో ప్రారంభించామని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి రైతుల కోసం కేవలం ఐదు గంటల కరెంటు అందిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణలో కేవలం మూడు గంటల విద్యుత్‌ అవసరమని రేవంత్‌ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ను పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టి వారి మేనిఫెస్టో తయారు చేశారని ఎద్దేవా చేశారు. నిజం గడప దాటకముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందన్నారు.

ప్రజలకు కంటి ముందు జరిగిన అభివృద్ధి తెలియజేసే బాధ్యత ప్రతి బీఅర్‌ఎస్‌ కార్యకర్తపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు కేవలం రూ. 400 లకు గ్యాస్‌ అందజేస్తామని తెలిపారు. రైతుల బాగు కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంవత్సరానికి రైతుకు పెట్టుబడి సాయం గా రైతుబంధు రూ. 16 వేలు ఇస్తామని ప్రకటించాడని అన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని హరీష్‌ రావు తెలిపారు.కేసీఆర్‌ బీమా ద్వారా కోటి మందికి ప్రయోజనం కలుగుతుందనీ అన్నారు. రైతు మరణిస్తే ఎలాంటి పైరవీలు లేకుండానే నేరుగా రైతులకు రైతు భీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్‌ రూ. 2 వేల నుంచి రూ. 5 వెలకు పెంచిన ఘనత సీఎం కేసిఆర్‌ కు దక్కుతుందని అన్నారు. పేదల అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కేసీఆర్‌ భరోసా కార్డ్‌ ను ప్రతీ గడప,గడపకు చేరవేయ్యాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఆపాలని ఎలక్షన్‌ కమిటీ వినతి చెయ్యడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను సోషల్‌ మీడియాతో ప్రచారం చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాల న్నారు. గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి శూన్యమని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతి పక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు మరుగున పడ కుండా గడపగడపకు తిరిగి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు