Friday, October 11, 2024
spot_img

550 విమానాలు రద్దుచేసిన ఇండిగో

తప్పక చదవండి

చెన్నై : మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం వర్షం తెరిపినివ్వడంతో రన్‌వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు. అయితే విమానాశ్రయాన్ని మూసివేయడంతో పెద్దఎత్తున విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా భారీగా తమ సర్వీసులను క్యాన్సల్‌ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై విూదుగా నడవాల్సిన 550 విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అయితే నేటి మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కాగా, తుఫాను ప్రభావంతో చెన్నపట్నంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం దంచికొడుతున్నది. దీంతో చెన్నై మహానగరానికి వెళ్లాల్సిన విమానాలు, రైళ్లు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు