Monday, May 13, 2024

బుల్ జోరు.. లాభాలే.. లాభాలే

తప్పక చదవండి
  • 493 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. దిగ్గజ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 493 పాయింట్లు లాభపడి 67,481కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు ఎగబాకి 20,268 వద్ద స్థిరపడింది.

ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు రాణించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి. ఫలితంగా నిఫ్టీ జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేయడం మార్కెట్లలో ఉత్సాహం నింపింది.
ఉదయం సెన్సెక్స్ 67,181.15 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,564.33 దగ్గర గరిష్ఠాన్ని, 67,149.07 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 492.75 పాయింట్లు లాభపడి 67,481.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,194.10 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,291.55 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 134.75 పాయింట్లు పెరిగి 20,267.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, పవర్రోడ్, హెచ్ఎ్యూఎల్ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి. ఎంఅండ్ం, విప్రో, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్ఎఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టైటన్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.28%), ఎన్టీపీసీ (2.97%), యాక్సిస్ బ్యాంక్ (2.71%), ఎల్ అండ్ టీ (2.52%), బజాజ్ ఫైనాన్స్ (1.84%).

టాప్ లూజర్స్:
విప్రో (-1.34%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.27%), మారుతి (-0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.35%), టెక్ మహీంద్రా (-0.29%).

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు