Saturday, May 18, 2024

ఆశయాల సాధనలో..అలుపెరుగని కృషి…

తప్పక చదవండి
  • ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్

హైదరాబాద్ : విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందనీ ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోఠి జిల్లా ఆధ్వర్యంలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏబీవీపీ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ఏబీవీపీ 1949 జూలై 9వ రోజు ఏర్పాటు చేశారన్నారు. జాతి పునర్నిర్మాణం కోసం పనిచేస్తుందన్నారు. అంచెలంచెలుగా ఎరుగుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ మాతాకీ “జై.. వందేమాతరం నినాదాలతో పనిచేస్తుందన్నారు. రేషన్ ఫస్ట్ ఇండివిజువల్ నెక్స్ట్ అన్న ఫిలాసఫీతోని జ్ఞానం శీలం ఏకత మంత్రంతోని పని చేస్తుందని అన్నారు. ఇంతటి ఉన్నంత ఆశయాలతో ఏబీవీపీ కొన్ని వ్యతిరేక శక్తులతో సంఘర్షిస్తూ ఆశయాల సాధనలో అలుపెరుగని కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు సమస్య వస్తే ఏబీవీపీ మందు ఉంటుందని “సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా అఖిల భారతీయ విద్యార్థి “పరిషత్ ముందు ఉండి ఆ సమస్యకు పరిష్కారం చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్ విద్యార్థి నాయకులు కిరణ్, సిటీ కళాశాల అధ్యక్షులు సాజన్ నగర కార్యదర్శిలు రాహుల్, విష్ణు, సౌశిక్, రమేష్, లక్ష్మణ్, సుభాష్, శివ శంకర్, సాయి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు