Sunday, May 19, 2024

మీ బిడ్డగా అండగా నిలబడుతా..

తప్పక చదవండి
  • ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి
  • ఇంటింటి ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి

మహబూబ్ నగర్ : అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా 20 ఏళ్లుగా నిస్వార్ధంగా పాలమూరు ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నాయకత్వంలో పెరిగిన వాడిని.. ఒక మచ్చలేని నాయకుడి పెంపకంలో పెరిగి పాలమూరు యువత ఆశయాలు సాధించుకునేందుకు నరేంద్ర మోడీ పంపిన ప్రతినిధిగా మీ ముందుకు వచ్చాను.. మీరు ఆశీర్వదించి పాలమూరు అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీని గెలిపిస్తే మొదటి తారీకున ఉద్యోగులకు జీతాలు వస్తాయని, డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా లాప్ టాప్ ఇచ్చి వారి కలల సహకారానికి కృషి చేస్తాను. పుట్టిన ప్రతి ఆడబిడ్డ కు రెండు లక్షల బ్యాంకు డిపాజిట్ బీజేపీ భరోసా ఇస్తుంది. వరి పండించిన రైతుకు మద్దతు ధర 3100 ఇచ్చి ఆదుకుంటుంది. రైతును కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. నిరుద్యోగులకు 5 ఎకరాల స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. మహిళలకు నూటికి ఒక్క శాతం వడ్డీతో రుణాలు ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. గర్భిణీలకు ఇంద్రధనస్సు పథకం కింద నరేంద్ర మోడీ పోషక ఆహారాన్ని ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత బిజెపి ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరం ఉండి అడిగినవారికి దేశీ ఆవును ఉచితంగా రైతులకు ఇస్తాము.

పాలమూరులో గెలిచేది నిలిచేది బీజేపీ మాత్రమే అని, బీఆర్ఎస్ డొల్ల పథకాలను, కాంగ్రెస్ గ్యారంటీలను ఇక్కడి ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మంత్రి అరాచకాలనుంచి పాలమూరును కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను.. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి. మండల అధ్యక్షులు వెంకటయ్య. శ్రీనివాసులు. లింగం, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి .ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ .రాచాల శ్రీధర్ .గడ్డం నాగరాజు .శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు