Monday, April 29, 2024

ధర్నాలో విద్యార్థిని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

తప్పక చదవండి
  • ఘటనపై స్పందించి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌

హైదరాబాద్‌ :హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఘటనకు బాధ్యురాలైన మహిళాకానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 55 జారీ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాయి. ఇందులోభాగంగా ఈ నెల 24న ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అయితే, స్థానిక పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. ఆ సమయంలో కానిస్టేబుల్‌ ఆయేషా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రaాన్సీని హోండా యాక్టివాపై వెంబడిస్తూ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. దీంతో ఆ యువతి కింద పడి తీవ్ర గాయాల పాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై పత్రికల్లో వార్త ప్రముఖంగా ప్రచురితమైంది. అనేక సోషల్‌ మీడియాల్లో వీడియో వైరల్‌ అయ్యింది. స్పందించిన సీపీ.. విచారణ చేపట్టి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకొన్నారు. అటు.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు ఇచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు