Friday, May 17, 2024

వక్స్‌ బోర్డు స్థలంలో అక్రమంగా వేసిన రేకుల షెడ్డు..!

తప్పక చదవండి
  • వక్స్‌ బోర్డు ఆశిర్‌ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం..
  • రాత్రివేళలో అక్రమంగా ఖనీలు నాటి రేకులతో షెడ్డు నిర్మాణం..
  • ప్రభుత్వ వక్స్‌ బోర్డ్‌ నుండి 2 గుంటల 30 గజాల స్థలం..
  • పోలీస్‌ స్టేషన్‌లో లింగాపురం ముస్లిం కమిటీ ఫిర్యాదు..

చెన్నారావుపేట : ప్రభుత్వ వక్స్‌ బోర్డు ఆశిర్‌ ఖానా స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టిన సంఘటన మండలంలోని లింగాపురం గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో ముస్లింలు పీరెమ్మలు నిలబెట్టుకోవ డానికి ప్రభుత్వం వక్స్‌ బోర్డ్‌ నుండి ఆశిర్‌ ఖానా కోసం 2 గుంటల 30 గజాల స్థలాన్ని కేటాయించింది.ఆ స్థలంలో లింగా పురం గ్రామానికి చెందిన పురం రాంబాబు, నామోజు భాస్కర్‌, ఏనుగుతల ఇంద్రయ్య,అమ్మిరెడ్డి కరుణాకర్‌, పసు నూటి వెంకటేశ్వర్లు,పోతు శంకర్‌, నామోజు రాజు, అంకూస్‌ మొగిలి,అమ్మిరెడ్డి అనిల్‌,అమ్మిరెడ్డి జై కుమార్‌, అమ్మిరెడ్డి రాజులు ఈనెల 17న రాత్రివేళలో అక్రమంగా ఖనీలు నాటి రేకులతో షెడ్డు నిర్మాణం చేపట్టారాన్నారు. అంతేకాక 18వ తేదీన ఆ రేకుల షెడ్డులో వినాయకుడిని ప్రతిష్టించారన్నారు.వెంటనే ప్రభుత్వ వక్స్‌ బోర్డుకు చెందిన ఆశిర్‌ ఖాన స్థలంలో అక్రమంగా వేసిన రేకుల షెడ్డును తొలగించి చట్టపరమైన చర్యలు తీసు కోవాలని చెన్నారావుపేట పోలీస్‌ స్టేషన్‌ లో లింగాపురం ముస్లిం కమిటీ బాధ్యులు మహమ్మద్‌ యాకూబ్‌ పాషా, ఉస్మాన్‌ పాషా, అంకుస్‌, హస్సేన్‌, ఖలీల్‌లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు