Saturday, May 18, 2024

ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలసిన అక్రమ కట్టడం

తప్పక చదవండి
  • అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మహిళలు, గ్రామస్తులు

కొండపాక : మహిళా భవనం కొరకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అక్రమ నిర్మాణాన్ని గ్రామానికీ చెందిన మహిళ మండలి సభ్యులంతా కలిసి కూలగొట్టి న సంఘటన కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, స్థానికులు, మహిళల కథనం ప్రకారం తమ గ్రామంలో మహిళా భవనం లేక గత కొన్ని సంవత్సరాల నుండి మహిళలు పడుతున్న ఇబ్బందులను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం స్పందించి మహిళా భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేసిందని తెలిపారు. గ్రామ పరిధిలో ని ప్రభుత్వ భూమి లో మహిళా భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ మార్చి నెలలో కొంత స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేసిందని తెలిపారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభు త్వం సహకరిస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువ స్తుంటే కొందరు గిట్టరాని అక్రమార్కుల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని వెలికట్ట గ్రామ మహిళలు తెలిపారు.

మహిళ భవనానికి చెందిన స్థలాన్ని గ్రామా నికి చెందిన కొందరు దురుద్దేశం తో ఆక్రమణకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేయడం సరైన పని కాదని సెక్రెటరీ, గ్రామ ప్రజలంతా తెలిపిన పట్టిం చుకోకుండా సొంత నిర్మాణాలు చేపట్టారని వివరిం చారు. సదరు ఆక్రమణ దారులు గతంలో కూడా ప్రభు త్వ భూమిని కబ్జా చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారని, ఇప్పుడు అదే పద్ధతిలో మళ్ళీ కబ్జా చేస్తున్నారని మహి ళలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సార్లు ఆక్రమణ దారులకు విష యం తెలిపినా వారు వినకపోవడంతో గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున స్థలం వద్దకు చేరుకొని అధికారు లకు, పోలీసులకు సమాచారాన్ని అందించి అక్రమ నిర్మా ణాలను తొలగించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నుండి కార్యదర్శి పలుమార్లు అక్రమ కట్టడాలు చేపట్టకూడదని గతం లో నోటీసులు జారీ చేసిన వాటిని రిసీవ్‌ చేసుకోకుండా ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. గ్రామస్తు లంతా నిర్మాణాలు కూల్చడంతో నిర్మాణాలు చేపట్టిన కుటుంబ సభ్యులు ఆగ్రహానికిగురై నట్లు వివరించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని మహిళ సమైక్య భవనం కొరకు కేటాయించిన స్థలాన్ని అన్యా క్రాంతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక మహిళ మండలి సభ్యులంతా పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు