Friday, July 19, 2024

నేనే రాజు నేనే మంత్రి అనే చందాన రిటైర్డ్ ఉద్యోగి.

తప్పక చదవండి
  • సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్..
    విద్యా సాగర్ రెడ్డి చెప్పిందే వేదం.. ఇచ్చిందే జీతం..
  • స్త్రీ నిధి సమాఖ్య పై కొరవడిన ప్రభుత్వ నిఘా..
  • సి.ఎస్.ఆర్ నిధులలో భారీ అవకతవకలకు స్కెచ్..?
  • రిటైర్డ్ ఉద్యోగి కబంధ హస్తాల్లో రూ.5400 కోట్ల నిధులున్న సంస్థ..
  • స్త్రీ నిధికి ఐ.ఏ.ఎస్ అధికారిని నియమించాలి..
  • ఏ జీ.ఓ. ప్రకారం విధుల్లో కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి..
  • తనకు తానే లక్షల్లో జీతం నిర్ణయించుకొని కాజేస్తున్న వైనం..
  • అతగాడిని విధుల్లో నుంచి తొలగించి..స్త్రీ నిధిలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్..

అప్పు లేని జీవితం.. ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుందన్నది నానుడి.. అయితే అవసరానికి మించిన అప్పు.. ఉప్పు కూడా చాలా ప్రమాదం.. చిన్న చిన్న అవసరాలకు కూడా ఒక్కోసారి డబ్బులు అందాకా ఎంతో బాధపడిన సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయి.. మరీ ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు అవసరానికి సరిపడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటి వారు విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని జీవనం గడుపుతుంటారు.. తీరా వడ్డీలతో కలిపి అప్పులు తీర్చడానికి నానా యాతన పడుతుంటారు.. ఒక్కోసారి అప్పులిచ్చిన వారు పెట్టె టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా అనేకం చూశాం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మహిళలకు రక్షణ కల్పించి ఆర్ధికంగా వారికి స్వావలంబన చేకూర్చే దిశగా తెలంగాణా ప్రభుత్వం అద్భుతమైన స్త్రీ నిధి పధకాన్ని తీసుకొనివచ్చింది…అయితే ఈ పథకానికి రిటైర్డ్ ఉద్యోగులనే చెదలుపట్టి, మహిళలకు ఉపయోగపడకపోవడం కాకుండా వారి జీవన విధానంలో అనేకానేక సమస్యలను తెచ్చిపెడుతోంది.. స్త్రీనిధి సమాఖ్యకు చీడపురుగులా దాపురించిన ఓ అధికారి అవినీతి చరిత్రే ఈ ప్రత్యేక కథనం..

హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ సంస్థల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, మహిళలు వారి భారిన పడకుండా కాపాడేందుకు సెర్ప్ సంస్థకు అనుబంధంగా 2011 లో స్త్రీ నిధి సంస్థను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది..మహిళలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ, సబ్సిడీ రుణాలు ఇస్తోంది.. తొలుత రుణాలు పొందిన మహిళా సంఘాలు క్రమం తప్పకుండా తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే.. ఆ సంఘాల వారు కట్టిన వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ రియంబర్స్ మెంట్ కింద తిరిగి వారికి మంజూరు చేస్తుంది.. ప్రభుత్వం మహిళలు ఆర్దికంగా తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు ఏర్పాటు చేసిన స్త్రీ నిధి సంస్థను కొందరు రిటైర్డ్ ఉద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటూ.. అందిన కాడికి దండుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. స్త్రీ నిధి సమాఖ్యలో విద్యా సాగర్ రెడ్డి తాను చెప్పిందే వేదం.. ఉద్యోగస్తులకు ఇచ్చిందే జీతం అనే విధంగా తయారయింది.. సీనియర్లకు తక్కువ వేతనం.. జూనియర్లకు ఎక్కువ వేతనాలు ఇస్తూ.. విద్యా సాగర్ రెడ్డి తన మార్క్ ద్వంద నీతిని ప్రదర్శిస్తున్నాడు.. స్రీనిధిలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వ నిఘా కొరవడడంతో 5400 కోట్ల రూపాయల నిధులు ఉన్న సంస్థని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని.. భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…వడ్డించే వాడు తన వాడైతే కూర్చున్న చోటుకే అన్ని వస్తాయనే నానుడిని విద్యాసాగర్ రెడ్డి అక్షరాల అమలు చేస్తూ.. తనకి నచ్చిన వ్యక్తికి నచ్చినట్లుగా వేతనాలు ఇస్తుండటం వెనుకాల భారీ ప్రణాళిక దాగుందనే ప్రచారం సర్వత్రా వ్యక్తమవుతోంది..స్త్రీ నిధిలో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగస్తులకు ఇస్తున్న వేతనాలను గమనించిన జాతీయ బిసి కమిషన్ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని సిఫార్సు చేసిన అట్టి ఆదేశాలను కనీసం పరిగణలోకి తీసుకోక పోవడం ఆయన చట్టాలకు ఇస్తున్న గౌరవం ఏంటో తెలియజేస్తుంది..తన సమీప బంధువైన ఓ మంత్రి నియోజక వర్గంలోనే ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ…ఆ మంత్రి ఓఎస్డీ అండ దండలతో అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం..

- Advertisement -

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ నిధులను సైతం తనకు ఇష్ట మొచ్చినట్లుగా ఖర్చులు చేస్తూ.. చేసిన ఖర్చుల కంటే అధిక బిల్లులు పెట్టుకొని కాజేస్తున్నట్లు స్రీ నిధి సంస్థ ఉద్యోగస్తులు సైతం చర్చించుకోవడం ఆ సంస్థలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతుంది..2019 సంవత్సరం నుండి ప్రభుత్వ జీ.ఓ లేకుండా విద్యాసాగర్ రెడ్డి విధుల్లో కొనసాగుతూ తనకు తానే నిబంధనలకు విరుద్ధముగా లక్షల్లో జీతాలు నిర్ణయించుకొని కాజేస్తున్నడు కానీ మాకు మాత్రం కనీస వేతనాలు ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.. స్త్రీ నిధి సంస్థకి ఐ.ఏ.ఎస్. అధికారిని నియమించి సంస్థ మనుగడను కాపాడాలని మరియు విద్యాసాగర్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు