Tuesday, June 25, 2024

భిన్న ధృవాలు కలిసిన వేళ..

తప్పక చదవండి
  • హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
  • ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్..
  • రాజ్ భవన్ లో బస చేయనున్న ద్రౌపది ముర్ము..
  • నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ కు హాజరు

హైదరాబాద్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరం చేరుకున్నారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు, డీజీపీ తదితరులు కూడా ఉన్నారు. రాష్ట్రపతికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాగా శుక్రవారం రోజు రాత్రి రాజ్ భవన్ లో ఆమె బస చేశారు.. నేటి ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు రాష్ట్రపతి హాజరవుతారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు