Saturday, May 11, 2024

దర్జాగా రోడ్డు కబ్జా.. ఆపై రౌడీయిజం

తప్పక చదవండి
  • బస్తి వాసులు ప్రశ్నిస్తే ..రౌడీలతో బెదురింపులు
  • బల్దియాకు ఫిర్యాదు చేస్తే.. డోంట్ కేర్
  • కార్పొరేటర్ కు ఫిర్యాదు చేస్తే.. బిజీ బిజీ
  • పోలీసుల వద్దకు వెళితే.. మాకు సంబంధం లేదంటున్నారు
  • ఎవరికి చెప్పుకోవాలో అయోమయ పరిస్థితుల్లో చర్మహాల్ బస్తి ప్రజలు

హైదరాబాద్ పాతబస్తీలో ఏది జరిగినా అది అందరికీ వింతగా కనబడుతుంది. ఆలాంటి విచిత్రమే మళ్ళీ ఒకటి తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే పాతబస్తీ హుస్సేని అలం పరిధిలోని చర్మహాల్ పేట్ల బృజ్ ప్రాంతముంది. అయితే ఈ ప్రాంతంలోని రోడ్డులు చాలా సన్నగా, చిన్నగా ఇరుకుగా ఉంటాయి. ఎదో రకంగా బస్తీ ప్రజలు సర్దుబాటు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే బస్తిలోని ఓ మహిళ కొత్తగా ఇల్లు కట్టుకుంటుంది. అలా కట్టుకుంటు తన ఇంటిముందున్న ఇరుకు రోడ్డును కబ్జా చేసేసింది. అంటే వాహనం వెళ్ళడానికె సరిగ్గా దారి ఉండని రోడ్డును కూడా వదలకుండా ఉన్న ఇరుకు రోడ్డును సగానికి కబ్జా పెట్టేసింది. అయితే ఈ విషయం పై బస్తి ప్రజలు వెళ్లి నేరుగా ఆ మహిళను ప్రశ్నించారు. నిమిషాల్లో స్థానిక రౌడీలను పిలిపించుకొని అడిగిన వారిని బెదిరించడం చేస్తుంది. సరే అని బల్దియా కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా కొందరు బస్తి వాసులు జీహెచ్ఎంసి యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేదు. తరువాత స్థానిక ఘాన్సీ బజార్ కార్పొరేటర్ పర్వీన్ సుల్తానా ఆఫీస్ కు వెళ్లి సమాచారం ఇవ్వగా ఆవిడ చాలా బిజీ గా ఉన్నారని, చూద్దాం అని దాటవేశారు. అక్కడ నుండి నేరుగా స్థానిక హుస్సేని అలం పొలిస్ ఠాణకు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఇక్కడ ఇలాంటి ఫిర్యాదులు స్వీకరించమని తేల్చేసారు.. దిక్కుతోచని పరిస్తుతుల్లో ఇక మిగిలింది మీడియా శరణ్యమే అని విలేకరుల వద్ద వెళ్లి తమ గోడును చెప్పుకున్నారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ స్పష్టంగా జీహెచ్ఎంసి అధికారులకు పదే పదే చెప్పుకుంటు వస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు కానీ, లేక రోడ్డును ఆక్రమిస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టంగా అదేశాలిచ్చారు. కానీ ప్రజల ఫిర్యాదులపై పాతబస్తీ సౌత్ జోన్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) దృష్టి సారించకపోవడంతో ఆక్రమణదారులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ప్రజలు మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కావున తక్షణం మునిసిపల్ మంత్రి చొరవ చెసుకొని ఆక్రమించుకున్న రోడ్డును తక్షణం స్వాదినపరుచుకొని వాహనాల రాకపోకలను పునరుద్దించాలని.. ఇంకా సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలివ్వాలని చర్మహాల్ బస్తి వాసులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు