Saturday, April 27, 2024

పూజలకు అనుమతించని మారేడుపల్లి ఎమ్మారో పద్మ.. !

తప్పక చదవండి

సికింద్రాబాద్, డిపిఎస్ స్కూల్, మహీంద్రా హిల్స్ పక్కన ఉన్న జగన్నాధ్ ఆలయంలో భాగవత్ సాప్తః చేసుకొనుటకు అనుమతించలేదు ఎమ్మారో పద్మ సుందరి. ఆలయ తరఫున హై కోర్టు అర్దర్లు ఉన్నా, అది ప్రభుత్వ భూమి అని వితండవాదం చేస్తూ.. భక్తుల సౌకర్యార్థ కోసం వేసిన తాత్కాలిక షెడ్డును తొలగించాలని ఆలయ కమిటీపై ఒత్తిడి తెస్తున్నారని ఆలయ కమిటీ వారు ఆరోపిస్తున్నారు. కాగా మంగళవారం హై కోర్టు స్పష్టంగా షెడ్డును తొలగించవద్దు అని స్టే ఆర్థర్ కూడా ఇచ్చింది. అయినా కూడా కోర్టు ఆర్థర్ ని ధిక్కరించి అవన్నీ నా వద్ద నడవవని చెప్పుకుంటూ షెడ్ ని తొలగిస్తారా..? లేక నన్ను తొలగించమంటారా అని మొండి వైఖరి చూపుతున్నారు.. ఇప్పటికే భజరంగ్ దళ్, వి హెచ్ పి, శివ సేన, కార్యకర్తలు ఎమ్మారో కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు లేని అబ్యoతరాలు ఇప్పుడెందుకని కమిటీ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మధ్యే ఆలయం పక్కనున్న స్కూల్ యాజమాన్యంతో కుమ్ముకై ఈ అభ్యంతరకర వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. మంగళవారం హై కోర్టు ఎమ్మార్వోకు స్పష్టంగా అలయంలో వేసుకున్న షెడ్ పై స్టే ఇచ్చినా కూడా.. అవన్నీ తనకు పట్టనట్లు వ్యవహరిస్తూ.. స్కూల్ యాజమాన్యం మెప్పు కోసం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.. ఒకవేళ ఎమ్మారో షెడ్ ని కదిలిస్తే బిజెపి, భజరంగ్ దళ్, వి హెచ్ పి సంఘాలు హైదరాబాద్ కలెక్టర్, ఎమ్మారో ఆఫీస్ ల ముందు ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంఘ నాయకులు తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు