Friday, July 26, 2024

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్బంగా అరుదైన బహుమతి ఇచ్చిన అభిమానులు!

తప్పక చదవండి
  • నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేసిన అభిమానులు
    RA:12H33M29S అనే నక్షత్రానికి మహేశ్ బాబు పేరు
    సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. బిరుదుకు తగ్గట్లే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూపర్‌‌ ‘స్టార్‌’‌ను చేశారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని గ్లోబల్ స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ‘RA:12H33M29S’ అనే నక్షత్రానికి మహేశ్ బాబును పెట్టినట్లు వెల్లడించింది.
  • ఇక మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు పోటెత్తాయి. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తదితర ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు