Saturday, April 27, 2024

మానవ అక్రమ రవాణా నిరోధం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి..

తప్పక చదవండి
  • వినతి చేసిన అక్రమ రవాణా నిరోధక యూనిట్స్, మహిళా రక్షణ విభాగం..

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ సమాజంలోని ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి అని రాష్ట్ర అక్రమ రవాణా నిరోధక యూనిట్స్, మహిళా రక్షణ విభాగం సి.ఐ.డి. ఎస్.పి కె.జి.వి. సరిత పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అమాయకులు జీవితాలు బలి అవుతున్నాయని సరిత ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం గుంటూరు సి.ఐ.డి. ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 30 వ తేదీన జరగనున్న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని విముక్తి, హెల్ప్ సంస్థలు రూపొందించిన ప్రచార గోడ పత్రికను సరిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సరిత మాట్లడుతూ.. మానవ అక్రమ రవాణా నుండి కాపాడబడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా, వారు తిరిగి మరో సారి అక్రమ రవాణాకు గురికాకుండా ఉండేందుకు వారికి రాష్ట్ర పభుత్వం అందిస్తున్న పునరావాస పధకాలు వారికి అందేలా కృషి చేయాలని ఆమె స్వచంద సంస్థలకు సూచించారు.. బాధితుల సమస్యలను, అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా ఎలా అరికట్టాలి అని చర్చించు కొని సరైన ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరముందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమం లో హెల్ప్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ వి. భాస్కర్, విముక్తి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ, నాయకులు లావణ్య, దుర్గ, నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు