Sunday, April 28, 2024

వర్టెక్స్ నిర్వాకం.. ప్రాణ సంకటం..

తప్పక చదవండి
  • కుంగిపోయిన అపార్ట్మెంట్స్..
  • ప్రాణభయంతో అపార్టుమెట్స్ వాసులు..
  • అక్రమ సెల్లార్ నిర్మాణంతో ఏర్పడ్డ ప్రమాదం..
  • అనుమతులు లేకుండానే నిర్మాణాలు..
  • ఖాళీ భూములను కబ్జా చేయడమే వర్టెక్స్ విధానం..
  • అధికారులను కొనేయడం అందినకాడికి ఆక్రమించుకోవడం..
  • వర్టెక్స్ కబ్జాలను అడ్డుకునేవారు ఎవరూ లేరా..?
  • అపార్ట్మెంట్స్ ప్రాంతాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
    మొవ్వా సత్యనారాయణ..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.. లింగంపల్లి, నల్లగండ్లలో ఏకంగా ఒక ప్రహరీ గోడ కూలిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనలో మునిగిపోయారు.. ఈ ప్రాంతంలో స్రావ్వ – స్వాతిక అపార్ట్మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్మెంట్ ను ఆనుకుని భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం జరిగింది.. నిబంధనలకు విరుద్ధంగా వర్షా కాలంలో సెల్లార్ పనులు చేపట్టింది బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ.. ఇదే ఇప్పుడు చేతును తెచ్చిపెట్టింది.. జీ.హెచ్.ఎం.సి. అధికారులు ఫిర్యాదులను పట్టించుకోకపోవడం దుర్మార్గం.. రాత్రికి రాత్రి ఏక్కడికి పోవాలో తేలియక ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ వాసులు.. ఆ వివరాలు చూద్దాం..

మంగళవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, నల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర స్రావ్వ – స్వాతిక అపార్ట్మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్మెంట్ ను ఆనుకుని
వర్టెక్స్ వారు అక్రమంగా లోతైన సెల్లార్ తవ్వడం వల్ల.. పక్కనే ఉన్న ఆ రెండు అపార్ట్మెంట్లు కృంగిపోవడంతో ప్రాణభయంతో బెంబేలెత్తి పోయారు అపార్ట్మెంట్ వాసులు..

- Advertisement -

కాగా ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ వెంటనే స్పందించి.. ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్టెక్స్ కంపెనీ వారు పెద్దపెద్ద భవనాలను.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి పడుతున్న భారీ వర్షాలకు నిర్మాణం చేపడుతున్న సెల్లార్ గుంతకు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ కూలిపోవడంతో.. అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి తరలి వెళ్లారు. జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వర్టెక్స్ ఏజెన్సీ, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ ఇస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు.. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..


అపార్ట్మెంట్ వాసులకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరదల నరేష్, మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చిట్టారెడ్డి ప్రసాద్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు