Friday, May 10, 2024

నాయీబ్రాహ్మణ కులవృత్తి మీద కేవలం నాయీబ్రాహ్మణులకే హక్కును కల్పించాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన తెలంగాణ నాయీ బ్రాహ్మణా ఐక్యవేదిక..

తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంపాల నర్సయ్య, సింగిరాల వెంకటస్వామిల ఆధ్వర్యంలో మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ వర్షం కురుస్తున్నప్పటికి వర్షంలోనే తడుస్తూ నాయీబ్రాహ్మణులు పెద్దఎత్తున క్షౌరవృత్తి మీద పేటెంట్ హక్కును కల్పించాలని ధర్నా చేసి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులు చేసుకునే క్షౌరవృత్తి అనేది సనాతన ఆచారంగా కొన్ని వందల సంవత్సరాల నుండి పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తి. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇబ్బడి ముప్పడిగా ఈ వృత్తిలోకి చొరబడి నాయీబ్రాహ్మణులు చేసుకునే క్షౌరవృత్తిని దోపిడి చేస్తున్నారు. గ్రామాల నుండి పట్టణాల వరకు నాయీబ్రాహ్మణుడు తన కులవృత్తి ద్వారా ఈ సమాజానికి సేవ చేస్తున్నాడు. మనిషి పుట్టుక నుండి చావు వరకు నాయీబ్రాహ్మణుడు లేనిది ఏ కార్యము జరగదు. ఇలాంటి సందర్భాలలో కార్పొరేట్ సంస్థల వారు ఎవ్వరు కూడ సనాతన ఆచారంగా వస్తున్న కార్యాలను చేయరు. వారి లక్ష్యం కేవలం వృత్తితో సంబంధం లేకుండా డబ్బులు సంపాదనే. కానీ నాయీబ్రాహ్మణుడు ఊరును వాడను పట్టుకుని ఈ కులవృత్తి ద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో నాయీబ్రాహ్మణ కులవృత్తిని కాపాడాలని అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలను ఈ వృత్తిలోకి రాకుండా నియంత్రించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక ఇదివరకే అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.

- Advertisement -

ఇంతలో ముందు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కార్పొరేట్ సెలూన్ లు ఇప్పుడు జిల్లాలకు మండలాలకు విస్తరించి నాయీబ్రాహ్మణ కులవృత్తిని దోపిడీ చేసే చేస్తున్నారు. ప్రభుత్వం రజకులను, నాయీబ్రాహ్మణులను ఇప్పటి వరకు సమాన దృష్టితో చూస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవల రజకులకు చేసుకొనే వారి వృత్తిని వేరే ఇతర కులస్తులు నిర్వహించరాదని ప్రత్యేకమైన చట్టాన్ని ప్రభుత్వం జారీ చేసి నాయీబ్రాహ్మణును మాత్రం ఆ జీవో పరిధిలోకి తీసుకు రాకపోవడం యావత్ నాయీబ్రాహ్మణ సమాజం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ జీవోను ఇవ్వడంలో రజక కులస్తులకు ఒక న్యాయం, నాయీబ్రాహ్మణులకు ఒక మరో న్యాయం చేయటాన్ని యావత్ నాయీబ్రాహ్మణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రెండు కులాలు గ్రామీణ స్థాయి నుండి, పట్టణ స్థాయి వరకు గ్రామాలను పట్టుకొని సమాజ సేవ చేస్తున్నటువంటి కులాలే, అటువంటి కులాలను వేరే చేసి చూడడం ప్రభుత్వ పెద్దలకు తగదని వారన్నారు. నాయీబ్రాహ్మణులు అన్ని ఆర్థికంగా రాజకీయంగా ఇలా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని. నాయీబ్రాహ్మణులను అన్ని రంగాలలో పైకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నదని. నాయీబ్రాహ్మణ కులవృత్తికి పేటెంట్ హక్కు కల్పించినట్లయితే ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని. అలా చేయడం ద్వారా కులవృత్తిని రక్షించడానికి ప్రభుత్వం ఎంతో మేలు చేసిన వారు అవుతారని వారు అన్నారు. రాజకీయంగా కూడ నాయీబ్రాహ్మణులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం పైనే ఉంది కనుక వెంటనే ప్రభుత్వం అన్ని విషయాలను ఆలోచన చేసి నాయీబ్రాహ్మణ కులవృత్తి మీద కేవలం నాయీబ్రాహ్మణులే నిర్వహించుకునే హక్కు ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన జీవోను ఇచ్చి ఈ సమాజాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని యెడల ఈఉద్యమాన్ని ఇతర జిల్లాలకు విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణులను ఏకం చేసి క్షౌరవృత్తి పైన పేటెంట్ హక్కు తోపాటు ప్రభుత్వ పెద్దలు ఇదివరకే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన సమస్యలను పరిష్కరించేంతవరకు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణులను ఏకం చేసి పోరాడుతూనే ఉంటుందని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గర్శకుర్తి శంకర్, శ్రీరాముల బాలసురేందర్, జంపాల శంకర్, శ్రీరాముల రమేష్, ముత్యాల లక్ష్మణ్, నడిగొట్టు కుమార్, అందుర్తి గంగాధర్, శ్రీరాముల ముని, సమ్మేట లక్ష్మణ్, గర్శకుర్తి రాజశేఖర్, కొత్వాల అశోక్, శ్రీరాముల నరహరి, కళ్యాణం శ్రీనివాస్, మందపెళ్ళి అంజయ్య, గర్శకుర్తి విద్యాసాగర్, స్వయంకృషి గడ్డం విరేందర్, రాసమల్ల కిషన్, కడారి శంకర్, శావనపల్లి రాజు, గడ్డం అంజన్న, ముల్లంకుల కనకయ్య, గుంజపడుగు మహేందర్, మండలాల అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, చెరుకు రమేష్, రాచకొండ శ్రీనివాస్, కంది నాగరజు, నారయణదాస్ కార్తిక్, తూముల శ్రవణ్, నారాయణదాస్ మహేందర్, కొత్వాల ఆంజనేయులు, సమ్మేట చంద్రమౌళి, శ్రీరాముల శ్రీనివాస్, అవుదుర్తి గోవర్ధన్, తూముల మనిసాయి, సొన్నాయిల భారత్, ఇన్నారపు మధు, గుంజపడుగు పవన్ కుమార్, సమ్మెట శివ, కర్మిల్ల రాజు, అవుదుర్తి వేణు, సముద్రాల రావి, నారాయణదాస్ శివ, తాంగేలపల్లి గణేష్, గుంజపడుగు సురేష్, నడిగొట్టు శ్రీనివాస్, సముద్రాల సాయి, తిప్పబత్తిన మహేష్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు