Sunday, October 13, 2024
spot_img

భారీగా నగదు పట్టివేత

తప్పక చదవండి
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక ఇంతకుముందే మరో రూ.8 కోట్లను కర్ణాటక నుంచి తెలంగాణకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. భారీగా నగదును సీజ్‌ చేసిన అనంతరం ఐటీ అధికారులు ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. కాగా బెంగళూరు నుంచి బైరే సంద్రకు లారీలో నగదును తరలించి, అక్కడి నుంచి ఏడు కార్లలో తెలంగాణకు తరలించాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. అంతేగాక బెంగళూరులో మరో 5 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. కాంట్రాక్టర్‌ అంబికాపతి ఇల్లు, గెస్ట్‌హౌస్‌, ఆఫీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని ఓ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు