Monday, May 20, 2024

హమాస్‌ కీలక ప్రకటన

తప్పక చదవండి

గాజా : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్‌ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్‌ స్పష్టం చేసింది. హమాస్‌ సైనిక విభాగం ప్రతినిధి అబు ఒబీదా మంగళవారం ఓ విూడియా సంస్థ ద్వారా మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కొందరు విదేశీయులను విడిచిపెడతాం. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న వారికి తెలియజేశాం. మాపై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్‌ సైన్యాన్ని విడిచిపెట్టేది లేదు. గాజా ప్రాంతాన్ని వాళ్లు నాశనం చేశారు. కాబట్టి, ఇజ్రాయెలీ సైనికులు, సైన్యాధికారుల్ని చంపి అక్కడే పాతేస్తాం. వాళ్ల మృతదేహాలతో గాజా అతిత్వరలో శ్మశానంగా మారబోతోంది‘ అని అన్నారు. అక్టోబర్‌ 7న హమాస్‌ బలగాలు రాకెట్‌ లాంఛర్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశాయి. సరిహద్దులోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. దాదాపు 240 మందిని అపహరించి గాజాలో తమ బందీలుగా చేసుకుంది. వాళ్లలో ఇజ్రాయెల్‌ పౌరులు, సైనికులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీళ్లను విడిపించాలని ఇజ్రాయెల్‌లో నిరసనలను తారాస్థాయికి చేరాయి. శాంతియుతంగా బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హమాస్‌ను సర్వనాశనం చేసి మరీ బంధీలను విడిపిస్తామని ఇజ్రాయెల్‌ ప్రతిన బూనింది. గాజా స్టిప్ర్‌పై విరుచుకుపడుతోంది. గాజా స్టిప్ర్‌లో ఇజ్రాయెల్‌ దాడి కారణంగా ఇప్పటి వరకు 8,525 మంది మృతి చెందినట్లు హమాస్‌ ఆధీనంలోని గాజా ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మృతి చెందిన వారిలో 3,500 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు