Monday, May 20, 2024

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పెరుగుతున్న మద్దతు

తప్పక చదవండి

వరంగల్‌ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువలా కొనసాగుతున్నది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలకు మంత్రికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నామినేషన్‌ ఖర్చుల నిమిత్తం పర్వతగిరి మండలానికి చెందిన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు 10 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. సోమవారం వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుని కలిసి ఆ మొత్తాన్ని అందజేశారు. అలాగే మంత్రికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు