Sunday, May 19, 2024

జనగామ సబ్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు..

తప్పక చదవండి

జనగామ : సోమవారం నాడు, గాంధీ జయంతి సందర్భంగా జనగామ పట్టణంలో సబ్ జైల్లో గాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జైలర్ పి.కృష్ణ కాంత్ తదితరులు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో నడిచి అందరూ ప్రశాంతమైన జీవనం కొనసాగించాలన్నారు..
క్షణిక ఆవేశంలో తెలియక కొంతమంది తప్పులు చేస్తారని ఆ తప్పులను గుర్తించి, సరిదిద్దుకొని సన్మార్గంలో నడుచుకోవాలని కోరారు.. జైల్లో ఉన్న ఖైదీల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బయటకు వెళ్లిన తర్వాత ప్రభుత్వం వివిధ రుణ సదుపాయాలు అందుబాటులో కి తెచ్చాయని వాటి ద్వారా ఉపాధి పొందాలన్నారు..
మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని ఖైదీలకు సూచించారు.. ఖైదీల సౌకర్యార్థం మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయాలన్నారు.. జైల్లో టీవీలు ఏర్పాటు చేయడం జరిగిందని మంచి మంచి కార్యక్రమాలు వీక్షించాలని అన్నారు.. సబ్ జైల్లోని వసతులను పరిశీలించారు.. ఖైదీలకు కావాల్సిన సౌకర్యాలు, అందుతున్న సేవల గురించి సబ్ జైలర్నీ అడిగి తెలుసుకున్నారు.. గాంధీ జయంతి సందర్భంగా సబ్ జైల్లో ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించారు.. అందులో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, జైల్ డాక్టర్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు