Saturday, July 27, 2024

అంకితభావం కార్యదక్షత నిజాయితీతోనే సమాజంలో గుర్తింపు..

తప్పక చదవండి
  • డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు…
  • కాళోజి వైద్య విద్యా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఏ కరుణాకర్ రెడ్డికి
    మహా మహోపాధ్యాయ పురస్కారం..
  • నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు జీవన సాఫల్య పురస్కారం అందజేత..
  • అంగరంగ వైభవంగా (రాజారత్న విద్యాసంస్థల) పురస్కార ప్రదాన కార్యక్రమం..

హైదరాబాద్ : కాళోజి నారాయణ రావు విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ కరుణాకర రెడ్డికి మహా మహోపాధ్యాయ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేయడం ఆ పురస్కారాలకే గౌరవం లభించినట్లు అయిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. వృత్తిలో అంకితభావం, కార్య నిర్వహణా దక్షత, పారదర్శక జీవితం మేళవింపుగా సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ఆ కోవలో డాక్టర్ కరుణాకర్ రెడ్డి డాక్టర్ బీరప్పలకు అవార్డులు లభించాయని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే గాంధీ జయంతి రోజున రాజారత్న ,ట్యూటర్స్ ప్రైడ్ సంస్థలు నిష్ణాతులకు అవార్డులను ఈ ఏడాది కూడా ఐ ట్యాప్ – 2023 పురస్కారాలను అందజేసింది. గత పదేళ్లుగా క్రమం తప్పకుండా ఈ అవార్డులను కొనసాగిస్తున్నది.. రాజా రత్న సంస్థ సోమవారం నాడు బేగంపేటలోని తాజ్ వివంత హోటల్లో ఈ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది..

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందజేశారు.. కార్యక్రమ నిర్వాహకులుగా డాక్టర్ ఆర్.బీ. అంకం, సమన్వయ కర్తలుగా డాక్టర్ వీ. బార్లా వ్యవహరించారు.. ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ…. రాజారత్న విద్యాసంస్థల పురస్కారాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉందన్నారు. సరైన వ్యక్తులకు అవార్డు ఇవ్వటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహా మహోపాధ్యాయ అవార్డు గ్రహీత కాళోజీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఈ అవార్డును స్వీకరించడం పట్ల తన ఆనందంను వ్యక్తం చేశారు. ఏ రంగంలో కృషి చేస్తున్నప్పటికీ, నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతే గుర్తింపు లభిస్తుంది అన్నారు. సమాజంలో గురువుల పాత్ర అనిర్వచనీయమనది అన్నారు. గురువుగా పాఠాలు బోధించినప్పుడు ,తాను పొందిన అనుభూతి గొప్పది అన్నారు. జీవన సాఫల్య పురస్కార గ్రహీత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రసంగిస్తూ మన దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు అన్నారు.. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన దేశంలో ఎక్కడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డులు పొందిన ప్రముఖులలో నారాయరెడ్డి, ఎల్. వేణుగోపాలరెడ్డి తదితరులు ఉన్నారు. విశిష్ట ఆత్మీయ అతిధులుగా మాజీ ఆర్.టి.ఐ. కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్, మాజీ మంత్రి బాబూమోహన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీ.ఎస్. రాములు, గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వెంకట్ రావు, ఇతర ప్రముఖులు, డాక్టర్ వెంకట సత్యనారాయణ, వెంకట్ రావు, విల్సన్, నంద కుమార్ రెడ్డి, అక్షయపాత్ర శ్రీనివాస్, రవీంద్ర,
క్రిష్ రాధాకృష్ణ, వకుళావ్యాస్, చేబ్రోలు శశిబాల, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు