Monday, April 29, 2024

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

తప్పక చదవండి
  • మాజీ డిజిపి మహేందర్ రెడ్డి టిఎస్ఎస్పి చైర్మన్గా నియామకం

హైదరాబాద్ : టీఎస్​పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే టి ఎస్ పి ఎస్ సి పేపర్లు లీక్ కావటం. పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. టి ఎస్ పి ఎస్ సి ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకున్న జనార్థన్ రెడ్డి.. తనకు తానుగా రాజీనామా చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సమర్థత, భద్రత, విశ్వసనీయత అంశాలను పరిగణలోకి తీసుకుని టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ పోస్టుకు మహేందర్​రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ ఆమోదించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు