Monday, May 20, 2024

ట్రాఫిక్‌ అడ్వైజరీని ఫాలో కావాలి

తప్పక చదవండి
  • సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి

శేరిలింగంపల్లి : ప్రతీ పౌరుడు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పక ఫాలో కావాలని సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరు ట్రాఫిక్‌ రూల్స్‌ ను బ్రేక్‌ చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. బుధవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ట్రాఫిక్‌ కు సంబంధించిన అడ్వైజరీ విడుదలైంది. డిసెంబర్‌ 31,నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులు,మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మహంతి మాట్లాడుతూ..కొత్త ఏడాదిని పురస్కరించుకొని కమిషనరేట్‌ పరిధిలోని కొన్ని రోడ్డు మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడిరచారు. క్యాబ్లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు(కాంట్రాక్ట్‌ క్యారేజీలు) అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉంటుకోవాలని సూచించ్షారు.బార్‌/పబ్‌/క్లబ్‌ వంటి సంస్థలకు కూడా పలు సూచనలు చేశారు. తాగి వాహనం నడపడం వల్ల కలిగే పరిణామాలు అడ్వైజరీలో వివరించారు. ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు