Sunday, July 21, 2024

ఇండియా కూటమిలో లుకలుకలు

తప్పక చదవండి
  • వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరి పోటీ
  • బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాలు
  • కాంగ్రెస్‌కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ
  • 10 నుంచి 12 స్థానాలు డిమాండ్‌ చేస్తోన్న కాంగ్రెస్‌
  • బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా : పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీచేసే ప్రసక్తి లేదన్నారు. బెంగాల్లో బిజెపిని ఓడిరచాలంటే తాను ఒంటరి పోరాటం చేయడమే మంచిదని నిర్ణయించానని అన్నారు. అందుకే ఈ సారి జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 42 సీట్లకు సంబంధించి కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే పొత్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాంగ్రెస్‌ తో కలిసి కాకుండా ఈ సారికి ఒంటరిగానే ఎన్నికల బరిలో పోరాడతామని తెలిపారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురించి తనకు సమాచారం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాగా.. మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె అవకాశవాది అని విమర్శించారు. దీదీ సహకారం లేకుండానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని ఆయన కోరారు. అధిర్‌ వ్యాఖ్యలతో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల్లో గందరగోళం నెలకొంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ కేవలం రెండు సీట్లు మాత్రమే ఆఫర్‌ చేశారని, సీట్ల కోసం కాంగ్రెస్‌ వెంపర్లాడదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు