Sunday, May 19, 2024

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

తప్పక చదవండి
  • సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతో
    ఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..

హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై
“ఎవని పాలయిందిరో తెలంగాణ” సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని – బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన తెలంగాణ ప్రజలారా అలాగే తెలంగాణ సాధనలో పాల్గొన్న సమరయోధులకు నేడు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రాసిన ఒక ముఖ్యమైన వ్యాఖ్యను గుర్తు చేస్తున్నాను.. “రాజకీయ ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడూ కూడా సామాజిక ప్రజాస్వామ్యం భూమిక లేకుండా ఏర్పడదు. మరి సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి..? అన్నప్పుడు ఎప్పుడైతే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం ఒకరి జీవితంలో లభిస్తాయో అప్పుడే దానికి సార్ధకత తోడవుతుంది” అని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారు..

ప్రస్తుతం ఈ పుస్తకం రచయిత బక్కా జడ్సన్, ప్రముఖ సామాజిక కార్యకర్త, ఏఐసీసీ సభ్యులు, వివిధ సామాజిక అంశాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తిగా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ పుస్తకంలో 100కు పైగా పిటీషన్లను సంకలనం చేసి తెలంగాణ ప్రజలకు, అలాగే దేశంలో సామాజిక స్పృహ ఉన్నటువంటి వారికి అర్థమయ్యేలా పుస్తక రూపంలో తెస్తున్నారు.. ఇందులో అవినీతితో కూరుకుపోయిన అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపటం జరిగింది. ఈ మొత్తం సంకలనం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు స్వరాష్ట్రంలో కన్న కలలు ఎలా కల్లలుగా మిగిలిపోతున్నాయో, అలాగే వైఫల్యాలు, వివాదాలు కారణంగా రాష్ట్ర ప్రగతి ఏ విధంగా కుంటుపడుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

నీటిపారుదల రంగంలో అవినీతి :
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాగునీటి రంగంలో ముఖ్యంగా ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పన నుంచి పలు లోపాలు బయటపడ్డాయి. అవినీతి లోప భూయిష్టమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకులు కలిసి నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్నదాతలు మరింత రుణగ్రస్తుల అవుతున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం వృధా కావడం మాత్రమే కాదు, రైతులు కన్న కలలు కూడా సాకారం కావడం లేదు. మిషన్ భగీరథ పేరిట సాగినటువంటి లోపాలు, అదే విధంగా పలు స్కీముల్లో కేవలం 10 శాతం మాత్రమే కార్యరూపం దాల్చగా మిగతావన్నీ కూడా పేపర్లకే పరిమితం అయ్యాయి.

భూ సమస్యలు – హెచ్ఎండిఏ వేలం పాటలు :
ధరణి పోర్టల్ ఆ సాఫ్ట్ వేర్ లోని లోపాలు ల్యాండ్ మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ముఖ్యంగా పేద రైతులు తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సరిపోకుండా హెచ్ఎండిఏ నగరం శివార్లలోని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో వేల కోట్లు విలువైనటువంటి భూములను వేలం పాటల పేరిట తెగనమ్మడం, పరిస్థితికి పరాకాష్ట అనే చెప్పాలి. ప్రస్తుత ప్రభుత్వానికి మేధావులతో పనిలేదు. మాఫియా తోను, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోనూ సంబంధాలు ఉన్నాయి. కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి వేలాది కేసులే ఇందుకు సాక్ష్యం.

ఇసుక, బొగ్గు, రాతి మైనింగ్ దోపిడీ :
ఇక ప్రకృతిని చెరపట్టేలా తెలంగాణలో ఎదవ సాగుతున్నటువంటి సాండ్ మాఫియా, బొగ్గు మాఫియా, ప్రకృతి వనరులైనటువంటి కొండల ధ్వంసం, యథేచ్ఛగా సాగుతోంది జిల్లాలో రాక్ మైనింగ్ పేరిట కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం, పచ్చని పల్లెలను కాలుష్యంతో నాశనం చేస్తున్నాయి. విలువైన ఖనిజాలు యదేచ్చగా సాగుతున్న మైనింగ్ వల్ల గ్రామాలు విషతుల్యం అవుతున్నాయి. నియంత్రణ లేని మైనింగ్ వల్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి.

యువతకు ఉపాధి, ఆరోగ్య రంగం విధ్వంసం :
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి యువతరం ఎక్కువగా ఉద్యోగాలపైనే ఆశపెట్టుకుంది. అయితే అదంతా ఒక నీటి బుడగలా మారిపోయింది ముఖ్యంగా కాంట్రాక్టు టెంపరరీ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తామని, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఎక్కడ కార్యరూపం దాల్చడం లేదు. ఇక టీఎస్పీఎస్సీ నియామకాలు వివాదాస్పదంగా మారడమే కాదు అవినీతిమయం అయ్యాయి. ప్రతిభకు ఆస్కారం లేకుండా పోయింది. ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు కన్న కలలపై టీఎస్పీఎస్సీ వ్యవహార శైలి వల్ల ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక ఎండమావిగా నిలిచిపోయింది.

ఇక వైద్య ఆరోగ్య రంగం విషయానికి వస్తే పూర్తిగా అవినీతిమయం అయింది. నిధులన్నీ కూడా పక్కదారి పట్టడమే తప్ప ప్రజారోగ్యం ఎవరికి పట్టడం లేదు. ఫలితంగా జాతీయస్థాయి ర్యాంకుల్లో తెలంగాణ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ప్రతి స్కీమ్ లోను నిధుల దారి మళ్లింపు తప్ప మరో ఉద్దేశంతో అనిపించడం లేదు. అన్ని స్కీములు కూడా పేపర్ అడ్వటైజ్మెంట్లకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.

ప్రాథమిక విద్య, ఉన్నత విద్య విధ్వంసం :
విద్య అనేది భవిష్యత్ తరాలకు పునాది లాంటిది. విద్యతో పాటు నైపుణ్యం కూడా యువతరానికి ఎంతో అవసరం అలాంటి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోంది. ఫలితంగా పాఠశాలలు కళాశాలలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు లేక వెలవెల పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేస్తోంది. అంతేకాదు ఆయా సంస్థల నుండి కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో పొందుతోంది. ఇక తెలంగాణలో విశ్వవిద్యాలయాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వైస్ ఛాన్స్ లర్ల వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలు కోర్టు కేసులు ఫలితంగా ఉన్నత విద్య అటకెక్కింది. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇక రాజకీయ నేతలు స్థాపించినటువంటి ప్రైవేటు యూనివర్సిటీలకు యథేచ్ఛగా అనుమతులు లభిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది.

ప్రశ్నించే గొంతులపై అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన :
బక్కా జడ్సన్ దాఖలు చేసినటువంటి పలు పిటిషన్లు రాజకీయ అణిచివేత అదే విధంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి పలు అంశాలు ఉండటం గమనార్హం. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ఏజెన్సీలు, గవర్నర్ సహా పలు వ్యవస్థలు చేస్తున్నటువంటి ఉల్లంఘనలు వెలుగులోకి తేవటం విశేషం. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘనలు సామాజిక న్యాయం విషయంలో అలక్ష్యం వంటివి పిటిషన్లలో పేర్కొన్నారు.

పోలీసు, అధికార వ్యవస్థలో ఉల్లంఘనలు వేధింపులు :
పోలీసులు, ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీల నేతల మెప్పు కోసం చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి చేటు లాంటిది ముఖ్యంగా రాజకీయ పార్టీ నేతలు చేస్తున్న తప్పులకు వీరు రక్షణగా నిలవడం పరిస్థితి పరాకాష్టకు నిదర్శనం. సిబిఐ, ఈడి, ఇతర సెంట్రల్ ఏజెన్సీలు సైతం జరుగుతున్న లోపాలను గుర్తించకుండా మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం వంటి అంశాలను పిటిషన్లలో పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయం కోసం, పీడిత పక్షాల నిలబడే వారి పట్ల పోలీసులు అధికారులు నిర్బంధం విధించడం హేయమైనది. జడ్సన్ పేర్కొన్నటువంటి పిటిషన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో కేవలం 10 శాతం మాత్రమే వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. ఈ పిటీషన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలుగా చూడవచ్చు. లక్షలాది కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా అవ్వడం ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులు రాష్ట్రం నేడు అప్పుల పాలవడానికి ప్రత్యక్ష కారకులు అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకానికి ముందుమాటగా రాయడం ద్వారా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజాలు తేటతెల్లమై రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన వ్యక్తిని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, పాండురంగ రెడ్డి అయిత గిరిబాబు, శశాంక్, ఓయు జేఏసీ నాయకుడు మైపాల్ యాదవ్, జర్నలిస్టులు, బాధితులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు